Posted on 2025-05-01 21:01:30
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మోదీ సర్కారు సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ప్రతి ఒక్క ఉగ్రవాదిని మట్టుబెడతామని పునరుద్ధాటించారు. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా, నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఏ ఉగ్రవాది తప్పించుకోలేరని చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచమంతా భారత్‌తో నిలుస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు పోరాటం ఆగదన్న అమిత్ షా, ఉగ్రదాడికి పాల్పడినవారికి తగిన శిక్ష విధిస్తామని పునరుద్ఘాటించారు.
"ప్రధాని మోదీ నాయకత్వంలో అది ఈశాన్య ప్రాంతాలు కావచ్చు, వామపక్ష తీవ్రవాద ప్రాంతాలు కావచ్చు లేదా కశ్మీర్‌లోని ఉగ్రవాద ప్రాంతాలు కావచ్చు. ప్రతిదానికి మేము గట్టి సమాధానం ఇచ్చాం. ఈ పిరికిపంద దాడి ద్వారా తాము పెద్ద విజయం సాధించినట్లు ఎవరైనా భావిస్తుంటే ఒక విషయం అర్థం చేసుకోండి. ఇది మోదీ ప్రభుత్వం ఎవరూ తప్పించుకోలేరని గ్రహించాలి. దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మా సంకల్పం."
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >