| Daily భారత్
Logo




ఆస్తి తగాదాలతో... తమ్ముడి కుటుంబం పై అన్న దాడి

News

Posted on 2025-04-27 16:38:51

Share: Share


ఆస్తి తగాదాలతో... తమ్ముడి కుటుంబం పై అన్న దాడి

- తగలబెట్టిన ద్విచక్ర వాహనం 

- కారు అద్దాలు ధ్వంసం 

న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు చల్ల ఉమారవి

డైలీ భారత్, మరిపెడ: ఆస్తి తగాదాలతో అన్నదమ్ముల మధ్య గొడవ జరగగా...తమ్ముడు భార్యపై అన్న పెట్రోల్ తో దాడి చేయగా త్రుటిలో తప్పించుకొని పక్కనే ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది...అలాగే ఇంటిముందు పార్క్ చేసి ఉన్న కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేశారు.. ఈ సంఘటన మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం గ్రామంలో చోటుచేసుకుంది.. బాధితులు చల్ల ఉమారవి తెలిపిన వివరాల ప్రకారం ఐదు ఎకరాల   భూమి విషయంలో గత పది సంవత్సరాల నుండి మా అన్న అయినా చల్ల సత్యనారాయణ భూ విషయంలో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని,భూమిపై వస్తే బెదిరింపులకు గురి చేస్తూ వస్తున్నారన్నారు..మా తల్లిదండ్రులు చల్లా మల్సూర్ ఉపేంద్ర కు ముగ్గురు సంతానమని పెద్దవాడైన సత్యనారాయణ భూమి విషయంలో కన్న తల్లిదండ్రులకు,తోడబుట్టిన అన్నదమ్ములకు ఇబ్బందులకు గురి చేస్తూ ఒక్కరే భూమిని ఆక్రమించుకొని తింటున్నారన్నారు.. ఈ విషయమై రెండు నెలల క్రితం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని పోలీసులు ముగ్గురు సమభాగం తీసుకోవాలని తీర్పు చెప్పారన్నారు.. అందులో భాగంగానే 5 ఎకరాల మామిడి తోటలో నా భాగంలో నేను మామిడికాయలు కోస్తూ ఉండగా, పెట్రోల్ బాటిల్ తో వచ్చే నా భార్య పై దాడి చేయగా త్రుటిలో    తప్పించుకుందని,పక్కనే ఉన్న ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయిందని,అలాగే కారు అద్దాలు ధ్వంసం చేసి రాళ్లతో కొట్టి అనరాని మాటలు తిడుతూ చంపేస్తానని బెదిరించారన్నారు.. రాజకీయ పలుకుబడితో నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో అన్న అయినా సత్యనారాయణ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, వీరారం గ్రామంలో బతకడానికి ఇబ్బందిగా ఉందని పోలీస్ వారు నాకు న్యాయం చేయాలని వేడుకున్నారు...అన్న చల్ల సత్యనారాయణ తో మాకు ప్రాణహాని ఉందని తెలిపారు...

Image 1

నిషేధిత భూములంటు"సెక్షన్ 22(ఎ )"తో రేవంత్ సర్కార్ "రాక్షస క్రీడ"

Posted On 2026-08-27 07:58:21

Readmore >
Image 1

గంజాయి కేసులో రికార్డుల ఫోర్జరీ.. ఎక్సైజ్ సీఐ, కానిస్టేబుల్ సస్పెండ్!

Posted On 2026-08-27 05:16:28

Readmore >
Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >