Posted on 2025-04-14 17:58:52
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టి.పి.టి.ఎఫ్ ( TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి అని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన ప్రసిద్ధ నినాదం విద్యావంతులు, ఉద్యమించండి, సంఘటితం చేయండి అని చెప్పి 100 సంవత్సరాలు అయింది. మరియు 100 సంవత్సరాల తరువాత కూడా లక్షలాది మంది అణగారిన ప్రజలకు విద్య ఇప్పటికీ అందనంత దూరంలో ఉంది - ఎక్కువగా ఉద్దేశపూర్వకంగానే విద్యను వ్యాపారంగా మార్చిన పాలకులు అణగారిని వర్గాలకు విద్యను దూరం చేస్తున్నారు అని అన్నారు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగింది. అలాంటి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉండాలని తెలియజేయడం జరిగింది, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాజీవితంలో ప్రజలందరూ సమాన అవకాశాలతో ముందుకు పోవాలని అలాంటి అసమానతలు లేని సమ సమాజ నిర్మాణం కోసం ఉపాధ్యాయులుగా మనం కృషి చేయాలని సమసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల కీలకపాత్ర పోషించి అంబేద్కర్ ఆశయ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిలుపునివ్వడం జరిగింది.
అదేవిధంగా మరో విప్లవ వీరుడు తెలుగు ప్రజల చేగువేరా కామ్రేడ్ జార్జిరెడ్డి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళిని అర్పించడం జరిగింది
జీవించాలంటే మరణం గురించి తెలుసుకో.... అడుగడుగున పోరాటం గురించి తెలుసుకో (జీనా హైతో మర్నా సీఖో - కదం కదం ఫర్ లడ్నా సీఖో)* అనేది జార్జి రెడ్డి ఇచ్చిన నినాదం. నాటి నుండి నేటి వరకు విద్యార్థి, యువజన, ప్రజా పోరాటాలలో ఇది రణనినాదమై ఉత్తేజాన్నిస్తోంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో TPTF జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పురం వాసుదేవరావు, నూగూరి దేవేందర్, జిల్లా కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీధర్ చకినాల రామచంద్రం. తంగళ్ళపల్లి మండల ప్రధాన కార్యదర్శి మధుసూదన్ వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు రామోజు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి దూస సంతోష్ కోనరావుపేట బాధ్యులు కోడం రాంప్రసాద్ వీర్నపల్లి బాధ్యులు సుల్తాన్ శ్రీనివాస్ పాల్గొన్నారు...
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >