| Daily భారత్
Logo




అనుమానాస్పద స్థితిలో తల్లి, కూతురు మృతి

News

Posted on 2025-04-13 11:49:45

Share: Share


అనుమానాస్పద స్థితిలో తల్లి, కూతురు మృతి

భర్త ఊరెళ్లి వచ్చేసరికి భార్య, కుమార్తె మృతి

గొంతు కోసిన స్థితిలో కుమార్తె, ఉరికి వేలాడుతూ భార్య

మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదం

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు

డైలీ భారత్, మిర్యాలగూడ: భర్త ఊరెళ్లి వచ్చేసరికి భార్య, కుమార్తె అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి ఓ ఫర్టిలైజర్ సంస్థలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. భార్య రాజేశ్వరి (34), కుమార్తెలు వేదశ్రీ , వేద సాయిశ్రీ (13)తో కలిసి మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. సీతారాంరెడ్డి ఈ నెల 10న సంస్థ పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లి నిన్న సాయంత్రం తిరిగి వచ్చారు.

అప్పుడే నిద్ర లేచిన పెద్ద కుమార్తె వేదశ్రీ గేటు తీసి అమ్మా, చెల్లి నిద్రపోతున్నారని చెప్పింది. దీంతో వేద సాయిశ్రీని నిద్రలేపేందుకు దుప్పటి తొలగించగా గొంతు కోసి చనిపోయి ఉంది. మరో గది లోపల గడియపెట్టి ఉండటంతో తలుపు బద్దలుగొట్టి లోపలికి వెళ్లి చూడగా రాజేశ్వరి ఉరికి వేలాడుతూ కనిపించింది. అలాగే, ఆమె ఎడమచేతి మణికట్టు వద్ద నరం కోసి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Image 1

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్

Posted On 2026-06-17 13:12:03

Readmore >
Image 1

రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

Posted On 2026-06-17 12:56:45

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన గ్రామపంచాయతీ కార్యదర్శి

Posted On 2026-06-17 12:51:22

Readmore >
Image 1

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-17 08:58:29

Readmore >
Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >