Posted on 2025-03-31 13:29:02
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అక్రమ అరెస్టును సిగ్గుచేటు
అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చెయ్యాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం కు వ్యతిరేకంగా ఆదివారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో భూముల వేలాన్ని నిలిపివేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు జేసీబీని అడ్డుకుంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన చేస్తున్న విద్యార్థులను అక్రమ అరెస్టులు చేయడం హేయమైన చర్య అని అరెస్టులు చేసిన విద్యార్థి నాయకులను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమించుకొని వేలం వేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడిదారుల దాహం తీర్చేందుకే భూముల అమ్మకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూమిని ఎరగా చూపి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టుపెట్టే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా భూములనే కొల్లగొట్టేందుకు సిద్ధమైతే భవిష్యత్తులో యూనివర్సిటీలో ఉనికి ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వాల నుండి ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితిలను గమనించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు భవిష్యత్తులో ప్రయోగశాలలకు అవసరమైన భూములు చేజారిపోతే భవిష్యత్ తరాల విద్యార్థులకు యూనివర్సిటీ ఉనికికి ప్రమాదమని న్యాయబద్ధంగా భూముల రక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కి అక్రమ అరెస్టులకు పాల్పడుతుంది. కెసిఆర్ ను తరిపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. ఇలాంటి నియంతృత్వ విధానాలను కొనసాగించి విద్యార్థులని అని కూడా చూడకుండా పోలీసులతో దుశ్చర్యాలను కొనసాగిస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అక్రమ అరెస్టును అఖిల భారత విద్యార్థి సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి పోలీసులు వెనకకు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. భూముల అమ్మకాన్ని విరమించుకోవాలి. లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వంశి హెచ్చరిస్తున్నామని అన్నారు
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >