| Daily భారత్
Logo




వచ్చే ఎన్నికల్లో మనమే వస్తున్నాం : మాజీ మంత్రి కెటిఆర్

News

Posted on 2025-03-23 15:53:59

Share: Share


వచ్చే ఎన్నికల్లో మనమే వస్తున్నాం : మాజీ మంత్రి కెటిఆర్

సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కెటిఆర్ 

హాజరైన పార్టీ మంత్రులు , ఎమ్మెల్యేలు , నేతలు , కార్యకర్తలు

డైలీ భారత్, కరీంనగర్ జిల్లా; కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అక్షరాల 420 అబద్దపు హామీలు... నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గుణపం దింపిన ఇందిరమ్మ రాజ్యం.. చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్‌కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్.. అధికారం కోసం అందరికి రుణమాఫీ- అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ చేశారంటూ ఆయన ఆరోపించారు.

‘‘ఎక్కని గుడి లేదు- మొక్కని దేవుడు లేడు.. చేయని శపథం లేదు-ఆడని అబద్దం లేదు.. ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు... నిండు శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గునపం దింపిన ఇందిరమ్మ రాజ్యం చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్‌కు తూట్లు పొడిచిన కపట కాంగ్రెస్.. అధికారం కోసం అందరికి రుణమాఫీ- అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ.. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టు- పెట్టెలో ఓట్లు పడ్డాయ్- జేబులో నోట్లు పడ్డాయ్- ఢిల్లీకి మూటలు ముట్టాయ్ ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత గంగలో కలిస్తే ఎంత అన్నట్లుంది కాంగ్రెస్ యవ్వారం.. రూ.2 లక్షల వరకు కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ అని ప్రకటించారు.. 

ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని చెబుతున్నారు... నాడు రూ. 2 లక్షలు దాటినా రుణమాఫీ అన్నారు.. ఇప్పుడేమో రూ. 2 లక్షల పైబడితే మాఫీ లేదంటున్నారు... నాడు ఓట్ల కోసం హామీలు .. నేడు ఎగవేత కోసం కొర్రీలు..’’అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గటం మాత్రమే కాదు.. ఆర్థికపరమైన అంశాల పరంగా, నిధుల కేటాయింపుల్లో కూడా తీవ్రమైన నష్టం జరుగుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపుల్లో కూడా అధికారం పూర్తిగా కేంద్రీకృతమై నియంతృత్వం వైపు దారి తీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశ జీడీపీకి 36 శాతం భాగస్వామ్యాన్ని అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు శిక్షింపబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చెన్నైలో జరిగిన జేఏసీ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రప్రభుత్వ వివక్ష కొత్తేమీ కాదని, ఇటీవల ఈ వివక్ష, అన్యాయం మరింత పెరిగాయని తెలిపారు. 

కేసీఆర్‌ నాయకత్వంలో అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ ప్రజలు తమ చిరకాల స్వప్పమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని గుర్తు చేశారు. తమిళనాడు ప్రజల నుంచి అనేక అంశాలను స్ఫూర్తిగా తీసుకుంటామని, అస్తిత్వం కోసం, హక్కుల కోసం కొట్లాడటంలో తమిళనాడు తమకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. తమ హక్కులు సాధించుకోవడానికి దేశంలోని రాష్ట్రాలకు.. తమిళనాడు ద్రవిడ ఉద్యమం ఒక దిక్సూచిలా పని చేస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >