Posted on 2025-02-24 11:06:51
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దినదిన అభివృద్ధి సాధించాలని వేడుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
పేద ప్రజలకు అన్నివిధాల సహాయాన్ని అందించే శక్తి రేవంత్ రెడ్డికి రావాలి
ఈ ప్రాంతం భక్తి మార్గంలో నడవాలని ఆశిస్తున్నా - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
హాజరైన ఏఐసిసి జాతీయ కార్యదర్శి చల్లా వంశీ చంద్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
ఆలయ అభివృద్ధి నిర్వాహకులు మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, ఆలయ చైర్మన్ బెజవాడ అనితారెడ్డిలకు స్పీకర్ అభినందనలు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అనంత పద్మనాభ స్వామి ఆలయాలకు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కేరళ, వికారాబాద్ తర్వాత షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం అంత ఆధ్యాత్మిక అభివృద్ధి సాధిస్తుందని ఇది ఎంతో శుభ పరిణామమని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ శివారులో పునర్నిర్మించిన 800 ఏళ్ల నాటి స్వయంభు శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయ ప్రారంభోత్సవ ఆధ్యాత్మిక వేడుకలకు స్పీకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీ జాతీయ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితర స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా
ఆలయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ ప్రకాష్ గౌడ్ ఏఐసీసీ నేత చల్ల వంశీ చంద్ రెడ్డిలకు ఆలయ నిర్వాహకులు మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి, ఆలయ చైర్మన్ బెజవాడ అనితారెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం గడ్డం ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ..
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ప్రముఖ ఆలయం తర్వాత వికారాబాద్ లో అంతటి పుణ్యస్థలం ఉందని ఇప్పుడు 800 ఏళ్ల నాటి స్వయంభు శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇక్కడ వెలవడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. దేశంలో ఈ మూడు ప్రాంతాలు స్వయంభూ ఆధ్యాత్మిక ప్రఖ్యాతిని గాంచుతాయని ఆయన అన్నారు. ఎంతో గొప్ప విశేషం కలిగి భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ ప్రాంతం భవిష్యత్తులో ఎంతో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరసిల్లుతుందని అన్నారు. ఒకప్పుడు అడవి ప్రాంతంగా ఉండే ఈ ప్రాంతంలో 800 ఏళ్ల స్వయంభు అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉండడం దాని మహిమాన్విత్వమైన విశేషతను గుర్తించి మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, బెజవాడ అనిత రెడ్డిలు ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేయడం అభినందనీయమని ప్రశంసించారు. ప్రభుత్వం ద్వారా పింజెర్ల ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ప్రభుత్వం ద్వారా మాట్లాడి ఆదేశాలు జారీ చేయిస్తానని చెప్పారు. వికారాబాద్ లో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజుల్లో 30 వేల మందికి పైగా ప్రతిరోజు దర్శనం చేసుకుంటారని అన్నారు. అదేవిధంగా పెంజర్ల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి కూడా అంత భక్తుల తాకిడి భవిష్యత్తులో ఉంటుందని స్పీకర్ అన్నారు. పెంజర్ల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాల్లో ఆ దేవుడిని తాను ముఖ్యమంత్రి ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండి వారి కుటుంబం చల్లగా ఉండాలని స్వామిని కోరుకున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఈ రాష్ట్ర ప్రగతిని ముందుకు నడిపించే విధంగా ఆయనకు స్వామి చల్లని కరుణ కటాక్షాలు ఉండాలని ఆ దేవుని కోరుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు వాగ్దానాలు నెరవేరి వారికి లాభం జరిగే విధంగా తమకు స్వామి శక్తి ప్రసాదించాలని కోరుకున్నట్టు తెలిపారు. ఇక్కడ ఏం కోరుకున్న జరుగుతుందని చెప్పడంతో తాను స్వామిని ఇవే కోరుకున్నానని మీడియా ముందు చెప్పారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో స్వామి చల్లని కరుణాకటాక్షాలతో వర్షాలు సమృద్ధిగా పడి రైతులకు పంటలకు మంచి జరగాలని స్వామిని వేడుకున్నట్టు తెలిపారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >