Posted on 2025-02-14 06:31:32
డైలీ భారత్, వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఫ్రాన్స్ నుంచి గురువారం రాత్రి అమెరికా చేరుకున్న మోదీ.. వాషింగ్టన్ లో దేశాధ్యక్షుడి అతిథిగృహమైన బ్లేయర్ హౌస్ లో బస చేశారు.
అనంతరం వైట్ హౌస్ లో డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలపై వారు చర్చించారు. వాణిజ్యం, భద్రత సహా పలు ఇతర అంశాలపై వీరిమధ్య చర్చకు వచ్చాయి.
భారత్, అమెరికా దేశాల మధ్య అద్భుతమైన స్నేహ సంబంధాలున్నాయని, రాబోయే నాలుగేళ్ల కాలం లోనూ ఆ సంబంధాలు అలాగే కొనసాగుతాయని ట్రంప్ తెలిపారు.
వైట్ హౌస్ లో ట్రంప్, మోదీ ఒద్దరూ పక్కపక్కనే కూర్చొ ని మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోడీ నాకు మంచి ఫ్రెండ్ మోడీని కలవడం గౌరవంగా ఉందని భావిస్తున్న,మోదీ అద్భుతంగా పనిచే స్తున్నారు. అందరూ ఆ విషయమే మాట్లాడుకుం టున్నారు.
మోదీ నిజంగా గొప్ప నాయకుడు అంటూ ట్రంప్ అన్నారు. గతంకంటే రాబో యే నాలుగేళ్లు మేమిద్దరం కలిసి పనిచేస్తామని మోదీ అన్నారు. రెండు దేశాలు కలిసికట్టుగా ఉన్నాయని ఇద్దరు నేతలు పేర్కొన్నారు.
కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో అపశృతి
Posted On 2025-03-23 12:33:58
Readmore >మెదక్ ఎంపీ, రఘునందన్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేసిన టెలికం బోర్డు మెంబర్ బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్
Posted On 2025-03-23 10:21:25
Readmore >120 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న బూర్గంపాడు పోలీసులు
Posted On 2025-03-23 03:09:25
Readmore >ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం వేడుకలు
Posted On 2025-03-21 18:08:13
Readmore >