| Daily భారత్
Logo




అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

News

Posted on 2025-02-14 09:54:09

Share: Share


అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

డైలీ భారత్, వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ విడతగా విమానంలో కొందరు భారతీయుల్ని స్వదేశానికి తిప్పి పంపారు. దాంతో అమెరికా మన పౌరుల్ని బలవంతంగా భారత్‌కు పంపిస్తోందని, ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. కానీ అమెరికా పర్యటనలో మోదీ సంచలన ప్రకటన చేశారు. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న దేశ పౌరులను భారత్‌కు తిరిగి తీసుకొస్తామని నరేంద్ర మోదీ ప్రకటించారు. 

ఓ దేశంలో చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారికి, అక్కడ నివసించే హక్కు ఉండదన్నారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. అక్రమ వలసల్ని ఏ దేశం సహించదని, ప్రపంచమంతా ఇది వర్తిస్తుందన్నారు. అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్యకు పరిష్కారం చూపుతారని భావించిన వారికి ప్రధాని మోదీ బిగ్ షాకిచ్చారు. మరోవైపు అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు, చదువుపూర్తయిన వారు రెస్టారెంట్లలో, బార్లలో, పెట్రోల్ బంకుల్లో కనుక కనిపిస్తే వారి వివరాలు ఆరా తీస్తుండటంతో భయాందోళన నెలకొంది. ఇటీవల పంజాబ్ యువకుడు డంకీ మార్గంలో అమెరికాకు వెళ్తూ మార్గం మధ్యలో చనిపోవడం కలకలం రేపింది.

మరో రెండు విమానాలలో భారత్‌కు..

అక్రమ వలసదారులపై అమెరికా ఉక్కుపాదం మోపింది. ఇదివరకే పలు దేశాలకు చెందిన వారిని విమానాలలో వారి స్వదేశాలకు పంపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన డిపోర్టేషన్‌ ప్రక్రియలో భాగంగా 104 మంది ఇండియన్స్‌ను సైతం తిప్పి పంపింది. ఫిబ్రవరి 5న విమానంలో వారు భారత్ కు చేరుకున్నారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగానూ మరో రెండు విమానాలలో కొందరు భారతీయులను స్వదేశానికి పంపిస్తున్నారు. ఇదివరకే ఓ విమానం బయలుదేరగా ఫిబ్రవరి 15న భారత్ చేరనున్న విమానంలో 170 నుంచి 180 మంది ఉంటారని సమాచారం. మరో విమానంలోనూ మరికొందర్ని భారత్‌కు తరలించేందుకు అమెరికా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Image 1

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు

Posted On 2025-12-07 14:24:59

Readmore >
Image 1

పర్యాటక రాష్ట్రం గోవాలో భారీ అగ్నిప్రమాదం

Posted On 2025-12-07 08:40:10

Readmore >
Image 1

టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

Posted On 2025-12-06 17:39:53

Readmore >
Image 1

హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య

Posted On 2025-12-06 16:17:59

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు

Posted On 2025-12-06 16:16:40

Readmore >
Image 1

ఘనంగా సామాజిక సమరసత దివాస్

Posted On 2025-12-06 15:48:27

Readmore >
Image 1

అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన

Posted On 2025-12-06 15:47:25

Readmore >
Image 1

చండ్రుగొండ మండలంలో 280 క్వింటాలరేషన్ బియ్యం పట్టివేత

Posted On 2025-12-06 15:34:05

Readmore >
Image 1

ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త

Posted On 2025-12-06 15:33:03

Readmore >
Image 1

సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి

Posted On 2025-12-06 15:32:07

Readmore >