Posted on 2025-02-10 15:40:16
సబ్ కే సాత్, సబ్ కా వికాస్ అంటున్న మోడీకి... వికలాంగుల వికాస్ కనబడదా?.
కేంద్ర బడ్జెట్లో 5% వాటా దివ్యాంగులకు కల్పించాలి.
5 వేలు పెన్షన్ పెంపు, అంత్యోదయ కార్డులు, ఉపాధి హామీ, రైల్వేలో రాయితీ కల్పించాలి.
ఢిల్లీలో జంతర్ మంతర్ చౌక్లో మహాధర్నాలొ
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :దేశవ్యాప్తంగా వేలాదిమంది వికలాంగులు తమ హక్కుల సాధన కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేషనల్ ప్లాట్‌ఫామ్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది డిసేబుల్డ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.వారు ప్రధానంగా పెన్షన్ హక్కుగా చట్టబద్ధత, కేంద్రం వాటా రూ. 5,000 పెంపు, ఉపాధి హామీ పథకంలో ఉద్యోగాలు, అంత్యోదయ రేషన్ కార్డుల కేటాయింపు, బడ్జెట్‌లో 5% నిధుల కేటాయింపు వంటి డిమాండ్లను ప్రస్తావించారు.
ఈ ధర్నాకు సీపీఎం ఎంపీలు జాన్ బిట్రస్, శివదాసన్, రహీమ్, డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ, సీపీఐ ఎంపీ వికాస్ రంజన్, టీఎంసీ ఎంపీ మౌషన్ నూర్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జావెద్ అలీఖాన్, ఇండియన్ ముస్లిం లీగ్ ఎంపీ హరీష్ బిరెన్, ఇతర పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలిపారు. వికలాంగుల హక్కుల సాధన కోసం పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.....2011 జనగణన ప్రకారం 2.68 కోట్ల మంది వికలాంగులు ఉన్నారని చెబుతున్న కేంద్రం, డబుల్ఎచ్ఓ లెక్కల ప్రకారం 16% జనాభా వికలాంగులేనని నిర్లక్ష్యంగా చూస్తోందని వక్తలు మండిపడ్డారు.2012 నుంచి కేంద్ర పెన్షన్ వాటా కేవలం రూ. 300గానే కొనసాగుతోంది. పెరుగుతున్న ధరలకు ఇది సరిపోదని, దీన్ని రూ. 5,000కు పెంచాలని డిమాండ్ చేశారు.ఇందిరా గాంధీ వికలాంగుల పెన్షన్ కేవలం 3.8% మందికే వర్తింపచేయడం సరికాదని, ఇది అందరికీ వర్తించేలాచేయాలని కోరారు.సుగమ్య భారత్ అభియాన్ కోసం బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతను బయటపెడుతోందని విమర్శించారు.కేంద్ర బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమం కోసం కేవలం 0.025% కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
పెన్షన్ చట్టబద్ధత కల్పించి, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూ. 300 మాత్రమే ఇస్తోంది. ఇది రూ. 5,000కు పెంచాలి.వికలాంగులకు ప్రత్యేకంగా అనువైన పనులను గుర్తించి ఉపాధి హామీ పథకంలో 200 రోజుల పని హామీ ఇవ్వాలి. అర్హులైన దివ్యాంగులకు అంత్యోదయ రేషన్ కార్డులు అందజేయాలని, వివాహ స్థితిని పరిగణనలోకి తీసుకోకుండా అందరికీ రేషన్ కార్డులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.ప్రత్యేక నిధుల కేటాయింపుకు 2025-26 కేంద్ర బడ్జెట్‌లో 5% నిధులు వికలాంగుల సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. రైళ్లలో రాయితీ పునరుద్ధరణ కల్పించి రాయితీలను తిరిగి అమలు చేయాలి. తమిళనాడు, మహారాష్ట్ర మాదిరిగా ప్రత్యేక విద్యా విధానం రూపొందించాలి.పారా క్రీడల ప్రోత్సాహం కోసం వికలాంగుల క్రీడలకు ప్రత్యేక ప్రోత్సాహం కల్పించాలి. నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు పెంపొందించి పార్లమెంట్‌లో చట్టం ద్వారా వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి. 2016 ఆర్పిడి చట్టం, మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్, యూ ఎన్ ఒప్పందాలు పటిష్ఠంగా అమలు చేయాలన్నారు.ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లుకు బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. "మోడీ ప్రభుత్వానికి పెట్టుబడిదారులంటే ప్రేమ, కానీ వికలాంగులపై దయ కూడా లేదా?" అంటూ వక్తలు మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు. పెన్షన్లు పెంచాలని ప్రశ్నిస్తే "సామర్థ్యమైన భారత్" అంటూ హక్కులను కాలరాస్తున్నారన్నారు. మోడీ పాలనలో కేటాయించిన నిధుల్లో 2020-21లో 64%, 2021-22లో 86%, 2022-23లో 79%, 2023-24లో 93% నిధులు విడుదల కాకపోవడం తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు.వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకుంటే ప్రతి రాష్ట్రంలో ఆందోళనలతో పాటు, పార్లమెంట్‌లోనూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. "సబ్ కే సాత్, సబ్ కా వికాస్ అంటున్న మోడీకి వికలాంగుల వికాస్ కనబడదా?" అని ప్రశ్నించారు. తమ హక్కులు నెరవేర్చకపోతే వికలాంగుల హక్కుల సాధన కోసం పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలొ ఎన్ పి ఆర్ డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి భుజంగ రెడ్డి ఎన్ పి ఆర్ డి జాతీయ ఉపాధ్యక్షలు జాన్సీ రని,శ్యామ్య గంగూలీ,కోశాధికారి చక్రవర్తి, సహాయ కార్యదర్శి రిషికేష్, కేంద్ర కమిటీ సభ్యులు కే వెంకట్, ఆర్ వెంకటేష్,జె రాజులతో పాటు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి స్వామి, అరిఫా, ఉపేందర్, కాషాప్ప, సహాయ కార్యదర్శులు దశరథ్, బాలేశ్వర్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >