Posted on 2025-02-09 15:17:38
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి వచ్చి దాడి చేశారు.
ఇంట్లోకి చొరబడి తన అనుచరులతో కలిసి విచక్షణ హంగామా చేశాడు వీర రాఘవరెడ్డి. దీంతో ఈ ఘటనపై అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో.. నిందితుడు వీర రాఘవరెడ్డిని ఎస్వోటీ (SOT) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. మూడు రోజుల క్రితం తెల్లవారుజామున వీర రాఘవరెడ్డి అనుచ రులు అర్చకులు ఇంట్లోకి చొరబడ్డారు.
అంతేకాకుండా.. రంగరాజన్‌పై దూషిస్తూ హల్చల్ చేశారు.కాగా.. ఆలయం సమీపంలోని రంగరాజన్ నివాసానికి శుక్రవారం నాడు కొంత మంది వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
అందుకు రంగరాజన్ నిరాకరించారు. రామరాజ్యం పేరుతో వచ్చిన వ్యక్తుల మాట నిరాకరించినందుకు తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని.. తనపైనా దాడి చేశారు.
ఈ దాడికి పాల్పడిన వారితో పాటు పరోక్షంగా వారికి సహకరించిన వ్యక్తులను కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అర్చకులు రంగరాజన్ తెలిపారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >