డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన ఇల్లంగి సాకేత్ 21 సంవత్సరములు తన తల్లిదండ్రులు, తనకు కొత్త సెల్ ఫోన్ కొని ఇవ్వాలని అడగగా, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగుగా లేదని కొద్దిరోజుల తర్వాత కొనిస్తామని తల్లిదండ్రులు చెప్పగా, తన స్నేహితులందరూ మంచి మంచి సెల్ఫోన్లు వాడుతున్నారని, తనకు సెల్ఫోన్ లేదనే కారణంతో, ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో ఉరి వేసుకొని మృతి చెందినాడు. తన కుమారుడి మరణం పై తనకు ఎలాంటి అనుమానం లేదని మృతుడి తండ్రి ఫిర్యాదు ఇవ్వగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్సై భదవత్ రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
News
తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదనే కారణంతో యువకుడు ఆత్మహత్య