| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోచమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ యువ నాయకులు వై. రవీందర్ యాదవ్

పోచమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ యువ నాయకులు వై. రవీందర్ యాదవ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మున్సిపాలిటీ  భగత్ సింగ్ కాలనీలోని  మైసమ్మ కట్ట  శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయంలో సోమవారం అమావాస్య ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ యువ నాయకుడు వై. రవీందర్ యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను పొందారు. అనంతరం అందే సరిత , జంగరాజు దంపతులు ఏర్పాటు చేసిన  అన్నదాన ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామదేవతలు శక్తి స్వరూపులని, అమావాస్య రోజున అమ్మవారిని కొలిస్తే  మంచి జరుగుతుందని ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, నాయకులు రఘునాథ్ యాదవ్, లక్ష్మీనరసింహా రెడ్డి, అందే పైలయ్య, భాస్కర్, అందె మహేశ్వర్, గుండు అశోక్, అల్లాడ శేఖర్, బీఆర్ఎస్ యూత్ వింగ్, తదితరులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..

Previous అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన 16 ఏండ్ల బాలిక
Next ప్రమాదాల నివారణ సామాజిక బాధ్యత: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
ADVERTISEMENT