| Daily భారత్
Logo




కనీసం 2 డీఎ లను తక్షణం ప్రకటించాలి : DTF రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ

News

Posted on 2024-10-27 19:05:30

Share: Share


కనీసం 2 డీఎ లను తక్షణం ప్రకటించాలి : DTF రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఐదు డిఏ బకాయిలు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ ప్రభుత్వము కేవలం ఒకే ఒక డిఏను ప్రకటించడము చాలా విచారకరము. ఉపాధ్యాయ, ఉద్యోగులకు 5 డీఏ లు, పిఆర్సి, మెడికల్, జిపిఎఫ్, సరెండర్ లీవ్ వంటి అనేక రకాల ఆర్థిక  బిల్లులు ధనవంతమైన మన తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పరిస్థితి. ఉపాధ్యాయ, ఉద్యోగులకు సంబంధించి ఈ అంశాలనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకుని, అధికారంలోకి వచ్చిన తక్షణం పరిష్కరిస్తామని చెప్పి, వాగ్దానాలు చేసి,  అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతము దాటవేత ధోరణి అవలంబిస్తుంది. ఒకవైపు ధనవంతమైన రాష్ట్రమని చెప్తారు, ప్రభుత్వం పెట్టే ఖర్చులన్నీ యధావిధిగా పెడుతూనే ఉంటుంది,  కానీ ఉద్యోగులకు న్యాయంగా రావలసిన వివిధ రకాల బిల్లుల చెల్లింపు, డిఏలు, పిఆర్సి వచ్చేసరికి మాత్రము చేతులెత్తేస్తుంది. పైగా సరియైన సమయంలో చెల్లించకపోవడమే కాకుండా, న్యాయంగా రావలసిన వాటికి దసరా, దీపావళి, సంక్రాంతి పండుగ కానుకలంటూ పేరు పెట్టడం జరుగుతుంది.  రాష్ట్ర ప్రభుత్వ ఈ వైఖరిని డీటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తీవ్రంగా  నిరసిస్తూ పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే చెల్లించాలని, తక్షణం కనీసం రెండు డీఏలయిన ప్రకటించాలని, 317 వంటి అనేక ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలలో జేఏసీ సూచించిన తక్షణ సమస్యలనైనా వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నది.

దొంతుల శ్రీహరి,

అధ్యక్షులు,

అవ్వురం సుధాకర్ రెడ్డి,

ప్రధాన కార్యదర్శి 

DTF రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ.

Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >