Posted on 2024-10-05 17:36:58
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు స్థానిక సెస్ ప్రభుత్వ బాలికల కళాశాల,సిరిసిల్ల యందు తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగ సంబరాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది.విద్యార్థినులు అందమైన బతుకమ్మలను పేర్చి ఆట పాటలతో హోరెత్తించారు.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి Y. శ్రీనివాస్ విచ్చేసి అందమైన బతుకమ్మలను పేర్చిన విద్యార్థినిలను అభినందించారు.దుర్గాదేవి ఆశీస్సులతో విద్యార్థినులు చదువులలో చక్కగా రాణించి కళాశాలకు మంచి పేరు తీసుకొనిరావాలని అన్నారు.చక్కని బతు కమ్మలను పేర్చిన విద్యార్థినులకు బహుమతులు అందించారు.కళాశాల ప్రిన్సిపాల్ G. వనజ కుమారి మాట్లాడుతూ ప్రకృతిని దేవతగా కొలిచే తెలంగాణ ఆడబిడ్డల పండుగ అయిన బతుకమ్మ పండుగ ను ప్రతి యేటా మా బాలికల కళాశాలలో ఘనంగా నిర్వహిస్తామని,మన ఆచార సంప్రదాయాలను, సంస్కృతి వైభవాలను కొనసాగించే భాధ్యత విద్యార్థినుల పై ఉన్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్స్ మురళీ, సీతారాము, సునీత,శ్రీనివాస్,ప్రవీణ్ కుమార్,నవీన్ రెడ్డి, ఆఫ్రోజ్ సుల్తానా,M.సునీత, జబీఉల్లా, గంగరాజు, భూపాల్, అనిత మరియు ఆఫీస్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >