Posted on 2023-08-29 08:59:45
అమరావతి: దివంగత
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్
శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ
రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి
ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా
స్మారక నాణెం విడుదల చేశారు.
అయితే ఈ కార్యక్రమానికి
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించిన
కేంద్రం.. ఆయన సతీమణి
లక్ష్మీపార్వతిని మాత్రం ఆహ్వానించలేదు. దీనిపై
ఆమె ఇవాళ నిప్పులు
చెరిగారు.
ఎన్టీఆర్ భార్యనని తాను బోర్డు
కట్టుకు తిరగాలా అని ప్రశ్నించారు.
ఇందుకు కారణమైన పురందేశ్వరిపైనా రెచ్చిపోయారు.
ఎన్టీఆర్ నాణెం విడుదల ప్రభుత్వ
కార్యక్రమం అయితే ప్రోటోకాల్ ప్రకారం
తనను పిలవాలని లక్ష్మీపార్వతి
తెలిపారు.
ఎన్టీఆర్ భార్యగా తనకు ఆహ్వానం
అందాలన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు
పొడిచిన వాళ్ళు ఇవాళ ఈ
కార్యక్రమానికి హాజరు అవుతున్నారని, తనకు
మాత్రం ఆహ్వానం లేదన్నారు. ఎన్టీఆర్
నాణెం విడుదల కార్యక్రమానికి వెన్నుపోటు
పొడిచిన వాళ్ళు వెళ్లడం అభ్యతరకరమని
లక్ష్మీపార్వతి ఆక్షేపించారు.
బిపిఎల్-1 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-15 06:39:17
Readmore >
విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన భీమారం సర్పంచ్ గీతా వీరేశం గుప్త
Posted On 2026-01-14 22:44:54
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి & సంక్రాంతి సంబరాలు
Posted On 2026-01-14 18:45:43
Readmore >