| Daily భారత్
Logo




తెలంగాణలో కాంగ్రెస్ అరాచకం పాలన : బెల్గాం ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర బిజెపి సభ్యత్వ ఇంచార్జ్ అభయ్ పాటిల్

News

Posted on 2024-10-01 18:51:00

Share: Share


తెలంగాణలో కాంగ్రెస్  అరాచకం పాలన : బెల్గాం ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర బిజెపి సభ్యత్వ ఇంచార్జ్ అభయ్ పాటిల్

షాద్ నగర్ లో బిజెపి ముఖ్య శ్రేణులకు దిశా నిర్దేశం

హాజరైన బిజెపి నేతలు కొల్లి మాధవి, బొక్కా నర్సింహారెడ్డి, శ్రీ వర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, పద్మజా రెడ్డి తదితరులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్  అరాచకం పాలన అని పేద ప్రజల ఆస్తులను కూలగొడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారని, హైడ్రా కూల్చివేతల్లో ప్రజలకు ఒక న్యాయం, తన సోదరుడికి మరో న్యాయం అంటూ కర్ణాటక రాష్ట్ర బెల్గాం బిజెపి ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర బిజెపి సభ్యత్వాల నమోదు కార్యక్రమ ఇంచార్జ్ అభయ్ పాటిల్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఏపీ కాంప్లెక్స్ లో బిజెపి ముఖ్య నాయకులకు ఎమ్మెల్యే అభయ్ పాటిల్ సభ్యత్వళ నమోదు కార్యక్రమంలో దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభయ్ పాటిల్ మాట్లాడుతూ ..

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల హైడ్రాను ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఉపన్యాయం తన సొంత సోదరుడికి మరో న్యాయం చేస్తూ అన్యాయం చేస్తున్నారని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీ ల హామీ ఇచ్చి మోసం చేశారని మొత్తం హామీలను నెరవేర్చలేకపోయారని విమర్శించారు. గడపదేళ్లు టిఆర్ఎస్ కుటుంబ పాలన అవినీతి అప్పుల రాష్ట్రంగా మార్చితే నేటి కాంగ్రెస్ పాలన ఘోర వైఫల్యాలతో కొనసాగుతుందని ఆరోపించారు. రాబోయే సంస్థ గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బలపరచాలని పిలుపునిచ్చారు. గత సభ్యత్వ నమోదు ద్వారా 11 లక్షల సభ్యత్వం ఉంటే ఇప్పుడు ఆ మార్క్ దాటిపోయిందని ఆయన అన్నారు. దీనికి కారణం కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగెత్తారని వాళ్లు మార్పు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. మోడీ విధానాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బిజెపిని ప్రజలు స్వచ్ఛందంగా బలపరుస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు యువత రైతులు అన్ని వర్గాలను సభ్యత్వ నమోదు సందర్భంగా కలిసి వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సిన అవసరం పెద్ద ఎత్తున ఉందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొల్లి మాధవి, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, అంతే బాబయ్య పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ పద్మజా రెడ్డి, చెంది మహేందర్ రెడ్డి కక్కునూరి వెంకటేష్ గుప్తా, కమ్మరి భూపాల చారి తదితరులు పాల్గొన్నారు..

Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >