| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

"స్వచ్చత హి సేవా" ముగింపు కార్యక్రమంలో సెస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల బృందం

 "స్వచ్చత హి సేవా" ముగింపు కార్యక్రమంలో సెస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల బృందం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ రోజు స్థానిక సెస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల,సిరిసిల్ల యందు NSS ఆధ్వర్యంలో గత నెల సెప్టెంబర్ 17 వ తేదిన ప్రారంభమై రేపు అక్టోబర్ 2 వ తేది మహాత్మా గాంధీ జయంతి తో ముగియనున్న "స్వచ్చత హి సేవా" కార్యక్రమం యొక్క ముగింపు సందర్భంగా విద్యార్థినుల చేత స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి Y. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాల అర్పించి విద్యార్ధినుల చేత స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించి, మొక్కలను నాటడం  జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులు తమ తరగతి గదులను మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత అలవాటు చేసుకోవాలని తెలిపారు.


కళాశాల ప్రిన్సిపాల్ G.వనజ కుమారి మాట్లాడుతూ మన కళాశాల,మన గ్రామం పరిశుభ్రంగా ఉంచుకుంటే మన దేశం కూడా పరిశుభ్రంగా ఉంటుందని,పరిశుభ్రత అనేది మొదట మన నుండే ప్రారంభం కావాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో కళాశాల NSS ప్రోగ్రాం కోఆర్డినేటర్ మడుపు నవీన్ కుమార్,కళాశాల లెక్చరర్స్ మురళీ,సీతారాము,శ్రీనివాస్,ప్రవీణ్ కుమార్, అఫ్రోజ్ సుల్తానా,గంగరాజు,సునీత,భూపాల్,అనిత మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Previous అనారోగ్యంతో గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో చేరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
Next విద్యార్దులు ఉన్నత స్థాయికి ఎదగాలి : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంక
ADVERTISEMENT