| Daily భారత్
Logo




మైసూరులో రేవ్‌పార్టీ.. అపస్మారక స్థితిలో 15 మందికిపైగా యువతులు.. 50 మంది అరెస్ట్.

News

Posted on 2024-09-30 11:47:18

Share: Share


మైసూరులో రేవ్‌పార్టీ.. అపస్మారక స్థితిలో 15 మందికిపైగా యువతులు.. 50 మంది అరెస్ట్.

మైసూరు శివారులోని ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ

50 మందికిపైగా అరెస్ట్..శాంపిళ్లు సేకరణ

చట్టపరమైన చర్యలు తప్పవన్న సీఎం సిద్ధరామయ్య

డైలీ భారత్, మైసూర్: కర్ణాటకలోని మైసూరులో మరో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 50 మందికిపైగా అరెస్ట్ చేశారు. మైసూరు తాలూకాలోని మీనాక్షిపుర సమీపంలోని ఓ ప్రైవేటు ఫాం హౌస్‌లో రేవ్‌పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి  చేసి భగ్నం చేశారు. పోలీసులిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌సీఎల్) బృందం పార్టీలో డ్రగ్స్ వినియోగంపై తనిఖీలు చేపట్టింది. పోలీసుల అదుపులో ఉన్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. దాడి సందర్భంగా 15 మందికిపైగా యువతులు అపస్మారకస్థితిలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

రేవ్‌పార్టీపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసులు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటారని చెప్పారు. పార్టీలో డ్రగ్స్ వినియోగాన్ని గుర్తించినట్టు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. పార్టీలో పెద్ద ఎత్తున మద్యం, సిగరెట్లు ఉపయోగించారని, పార్టీకి హాజరైన వారి నుంచి శాంపిళ్లు సేకరించామని, రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >