Posted on 2024-09-22 18:06:55
శాంతిని నెలకొల్పాలి - ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ఇంటర్నేషనల్ యూత్ కైండ్ నెస్ సెమినార్ ముగింపు సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ,షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ప్రపంచంలో మానవాళి మనుగడ కేవలం శాంతి, సామరస్యాలతోనే కుదురుతాయని, మానవాళి భవిష్యత్తుకు అందరూ ప్రయత్నం చేయడం ఎంతో గొప్ప విషయమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం ఇంటర్నేషనల్ యూత్ కైండ్ నెస్ సెమినార్ ముగింపు సమావేశం సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు తోపాటు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. నియోజక వర్గంలోని నందిగామ మండలం చెగూర్ కన్హ శాంతి వనంలో ఇంటర్నేషనల్ యూత్ కైండ్ నెస్ సెమినార్ ముగింపు సమావేశంలో సమావేశాలను ఉద్దేశించి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత విలువైన సేవలను ఇక్కడ కన్హ శాంతి వనంలో కొనసాగించడం గొప్ప విషయం అని అభినందించారు. ప్రపంచ శాంతి సౌభ్రాతృత్వాల కోసం కృషి చేస్తున్న తీరు ఎంతో గొప్పదని అన్నారు. యువతను దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ సెమినార్ కోసం దేశ విదేశాల నుండి ఇక్కడికి ప్రతి నిధులు రావడం సంతోషకరమని వారు అన్నారు. కన్హ శాంతి వనం ఈ ప్రాంతానికి ఈ దేశానికి తద్వారా ప్రపంచానికి ఒక మంచి సంకేతాలను అందజేస్తుందని అన్నారు. ప్రభుత్వం తరఫున ఏ సహాయం కావాలన్నా తప్పకుండా వారికి లభిస్తుందని భరోసా ఇచ్చారు. మానవాళి భవిష్యత్తుకు కన్హ శాంతివనం లో జరిగే ప్రతీ కార్యక్రమం ఒక దిక్సూచి లాంటిదని వారు పేర్కొన్నారు. ఒకప్పుడు ఖాళీ స్థలాలుగా బీడు వారినట్లు కనిపించేవని ఇప్పుడు కన్హ శాంతి మనం ఏర్పాటు అయ్యాక అందమైన సుందరీ కరణ పనులు పచ్చని చెట్లు పర్యావరణ ఎంతో గొప్పగా సంసిద్ధం చేశారని వారు కొనియాడారు. కన్హ వ్యవస్థాపకులు దాజీ ఇంత గొప్ప కార్యక్రమాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం అభినందనీయమని కొనియాడారు. మొదటి నుండి ఈ ఆశ్రమానికి తన వంతు సహకారం లభిస్తుందని తెలిపారు..
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >