| Daily భారత్
Logo




లెబనాన్ లో వాకి టాకీలు పేలి 20 మంది దుర్మరణం ... 450 మందికి తీవ్ర గాయాలు

News

Posted on 2024-09-19 08:19:12

Share: Share


లెబనాన్ లో వాకి టాకీలు పేలి 20 మంది దుర్మరణం ... 450 మందికి తీవ్ర గాయాలు

డైలీ భారత్,  లెబనాన్‌: లేబనాన్ లో మంగళవారం పేజర్ల సంఘటన మరువ కముందే ఈరోజు ఉదయం లెబనాన్‌లో వైర్‌లెస్ కమ్యూనికేషన్ పరికరాలు మరోసారి పేలడంతో 20 మంది చనిపోయారని, 450 మంది గాయపడ్డారని ఆ దేశ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.

హిజ్బుల్లాకు బాగా పట్టున్న ప్రాంతాలుగా పరిగణించే బీకా వ్యాలీ, దక్షిణ లెబ నాన్, బీరూట్‌కు దక్షిణ శివారు ప్రాంతాల్లో హిజ్బుల్లా గ్రూప్ సభ్యులు ఉపయోగించిన వాకీ టాకీలు పేలాయి.

మంగళవారం హిజ్బుల్లా గ్రూప్ సభ్యులు ఉపయో గించే పేజర్లు పేలడంతో 12 మంది చనిపోయారు. వీరిలో కొంతమంది అంత్య క్రియలు జరుగుతుండగా కొన్ని వాకీటాకీలు పేలా యని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

ఈ దాడులు ఇజ్రాయెల్ చేసిందని హిజ్బుల్లా ఆరోపించింది. ఇజ్రాయెల్ దీనిపై స్పందించలేదు. యుద్ధం మరో అంకానికి చేరిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ ప్రకటించిన తరుణంలోనే హిజ్బుల్లాపై ఈ దాడులు జరిగాయి.

అలాగే లెబనాన్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్ ఆర్మీని మోహరించింది.ఈ పరికరాలన్నింటినీ పేల్చేయ డం అనేది ఒక పెద్ద మిలి టరీ ఆపరేషన్‌కు ముందు చేసే సన్నాహక దాడుల్లా కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటె రస్ అన్నారు. అందరూ శాంతిని పాటించాలని ఆయన సూచించారు.

ఉత్తర ప్రాంతంలో నిరాశ్రయులుగా మారిన వేల మంది ప్రజలను సురక్షితంగా ఇళ్లకు చేర్చుతామని పేలుళ్లు జరిగిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హామీ ఇచ్చారు.యుద్ధంలో కొత్త అంకాన్ని మొదలు పెట్టామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ చెప్పారు. 

వనరులు, బలగాలను తరలిస్తూ తమ దృష్టి ప్రధానంగా ఉత్తరం వైపే కేంద్రీకరించామని వెల్లడించారు.గాజాలో క్రియాశీలంగా వ్యవహరిం చిన ఒక ఆర్మీ బృందాన్ని మళ్లీ ఉత్తరాన మోహరించి నట్లు ఇజ్రాయెల్ మిలటరీ ధ్రువీకరించింది.

Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >