Posted on 2024-09-16 08:08:59
డైలీ భారత్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా: వర్షాలు ఆగాయి.. వరదలు తగ్గాయి. సామాన్యుడికి కష్టాలు పెరిగాయి. వరద నష్టం కూరగాయలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కూరగాయల ధరలు కొండెక్కాయి.సామాన్యులు కొనే పరిస్థితి లేకుండా పోతుంది.
భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల పంట నష్టపోవడంతో.. దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి చేరువయ్యాయి.
ఈసీజన్‌లో అందరికి అందుబాటులో ఉండే కూరగాయాలు, ఆకుకూరల ధరలు.. భారీ వర్షాల కారణంగా పెరిగిపోయాయి. ముందుముందు.. మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిసాయి.
దీంతో కూరగాయల సాగు దెబ్బ తీసింది. గణనీయంగా కూరగాయల దిగుబడి తగ్గింది. చాలాచోట్ల కూరగాయల తోటలు మునిగిపోయాయి. మరికొన్ని కోట్ల వరదలకు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో అన్ని రకాల కూరగాయాల ధరలు నలభై శాతం వరకు పెరిగాయి
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >