| Daily భారత్
Logo




ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళపై వార్డు బాయ్‌ లైంగిక వేధింపులు

News

Posted on 2024-09-15 22:00:21

Share: Share


ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళపై వార్డు బాయ్‌ లైంగిక వేధింపులు

డైలీ భారత్, పశ్చిమబెంగాల్: కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఘటన మరువక ముందే నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో దారుణం వెలుగుచూసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడికి తోడుగా కోల్‌కతా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్ హెల్త్ ‌(ICH) చిల్డ్రన్స్‌ వార్డులో నిద్రిస్తున్న మహిళపై నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడిని హాస్పిటల్‌లో వార్డ్‌ బాయ్‌గా పనిచేస్తున్న తనయ్‌ పాల్‌ (26)గా గుర్తించారు.

చిల్డ్రన్స్‌ వార్డ్‌లోకి ప్రవేశించిన తనయ్‌ పాల్‌ మహిళను అభ్యంతరకరంగా తాకాడు. ఈ ఘటనను నిందితుడు తన మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోన్‌ను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపారు.

ఆపై నిందితుడిని స్ధానిక కోర్టులో హాజరు పరచగా నిందితుడిని కోర్టు పోలీస్‌ కస్టడీకి ఆదేశించింది. ఇక పశ్చిమ బెంగాల్‌లోని బీర్భం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో డ్యూటీలో ఉన్న నర్స్‌ను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేయగా అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ రోగికి నర్సు సెలైన్‌ ఎక్కిస్తుండగా రోగి ఆమెను అభ్యంతరకరంగా తాకాడు. తన పట్ల అసభ్యంగా వ్యవహరించడంతో పాటు తనపట్ల అనుచిత వ్యాఖ్యలు చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు

Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..

Posted On 2026-04-25 17:10:44

Readmore >
Image 1

కవిత "పాంచజన్యం" హామీలు

Posted On 2026-04-25 13:59:56

Readmore >
Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >
Image 1

నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-25 08:24:31

Readmore >
Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >