| Daily భారత్
Logo




బాలాపూర్ రికార్డ్ బ్రేక్.. మాదాపూర్ మైహోమ్ భుజా గణేషుడి లడ్డూ ఎన్ని లక్షలో తెలుసా..?

News

Posted on 2024-09-15 18:40:14

Share: Share


బాలాపూర్ రికార్డ్ బ్రేక్.. మాదాపూర్ మైహోమ్ భుజా గణేషుడి లడ్డూ ఎన్ని లక్షలో తెలుసా..?

డైలీ భారత్, హైదరాబాద్: ఇప్పటివరకు హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన లడ్డూగా.. బాలాపూర్ గణేషుని లడ్డూ మాత్రమే ఉండేది. కాగా.. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేశాడు మాదాపూర్ మైహోమ్ భుజా వినాయకుడు. గతేడాది బాలాపూర్ గణేషుడు సృష్టించిన రికార్డును బ్రేక్ చేసి.. మరో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. మాదాపూర్ మైహోమ్ భుజాలో గణేషుని లడ్డూకు నిర్వహించిన వేలానికి విశేష స్పందన లభించింది. హోరాహోరీగా సాగిన వేలంలో లడ్డూ రూ.29 లక్షలు పలికింది.

మాదాపూర్ మైహోమ్ భుజా గణేషుని లడ్డూ రికార్డ్ వేలంలో రూ.29 లక్షలు పలికిన గణనాథుని లడ్డు బాలాపూర్ గణేష్ లడ్డూ గత రికార్డు బ్రేక్

అత్యంత ఖరీదైన లడ్డూగా మాదాపూర్ మైహోమ్ భుజా గణేషుడు కొత్త రికార్డు సృష్టించాడు. ఎప్పటిలాగానే.. మైహోం భుజా అపార్ట్ మెంట్స్‌లో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూకు వేలం పాట నిర్వహించగా.. విశేష స్పందన లభించింది. వేలం పాట అంతే హోరా హోరీగా సాగింది. ఈ హోరా హోరి వేలం పాటలో.. గణేషుని లడ్డూ ఏకంగా 29 లక్షలు పలికింది. ఖమ్మంకు చెందిన కొండపల్లి గణేష్.. వినాయకుడి లడ్డూను రూ. 29 లక్షలకు సొంతం చేసుకున్నాడు. దీంతో.. హైదరాబాద్ మహానగరంలోని అత్యంత ఖరీదైన ధర పలికిన లడ్డూగా.. మైహోం భుజా గణనాథుని లడ్డూ నిలిచింది.

Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >