| Daily భారత్
Logo




భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు

News

Posted on 2024-09-14 15:58:34

Share: Share


భద్రాచలం వద్ద గోదావరి నదిలో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు

జిల్లా వ్యాప్తంగా 1537 గణేష్ విగ్రహాల ఏర్పాటు

గోదావరి నది కరకట్ట వద్ద గణేష్ నిమజ్జోత్సవం జరిగే ప్రదేశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజా ఐపిఎస్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: గణేశ్ నవరాత్రులు ముగించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలియజేసారు.ఈ రోజు నిమజ్జనం జరిగే ప్రదేశాలను జిల్లా ఎస్పీ సందర్శించారు.నిమజ్జన సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు వారి సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు,ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయడం జరుగుతుందని అన్నారు.జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు మరియు నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేయనున్నామని తెలిపారు.నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు,బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు.ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసు వారి సూచనలను పాటించాలని కోరారు.చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.భక్తిశ్రద్ధలతో నవరాత్రులను ముగించుకొని ఆఖరున జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని మత సామరస్యంతో,శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో మొత్తం 1537 విగ్రహాలతో పాటు,రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మొత్తంలో భద్రాచలానికి నిమజ్జనానికి వస్తున్న భక్తులకు ఇలాంటి సౌకర్యాలు కలగకుండా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాదామైనదని తెలియజేసారు.

Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >