Posted on 2024-09-11 14:46:14
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నందిగామ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం నిమిత్తం ప్రముఖ వ్యాపారవేత్త నీలం విజయకుమార్ భారీ విరాళం అందజేశారు. బుధవారం ఈ సందర్భంగా నీలం విజయ్ కుమార్ మాట్లాడుతూ నందిగామ మండలం లోని అయ్యప్ప స్వామి దేవాలయం పునర్నిర్మాణం నిమిత్తం రూ, రెండు లక్షల 50 వేలు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణంలో భాగంగా తన వంతు విరాళం అంద చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం సహకారం అందజేసినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో దేవాలయాల నిర్మాణంలో భాగంగా తన వంతు సహకారం అందజేసినట్లు ఆయన అన్నారు. అనంతరం శ్రీ శ్రీ గిరీషన్ సతీషన్ నాయర్ గురుస్వామి చేతుల మీదుగా శాలువాలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ జిల్లెళ్ల బాల్ రెడ్డి, బాతుక లక్ష్మయ్య యాదవ్, బంటారం దర్శన్ గౌడ్, వావిలాల హరి జీవన్,ఎదిర శ్రీకాంత్ గౌడ్, నవాబ్ పేట్ శేఖర్ గౌడ్, నరసింహులు గౌడ్, నారాయణ గౌడ్, తుమ్మల నరసింహులు యాదవ్, బాంట్రపు జంగయ్య గౌడ్,లక్ష్మణ్,చించేటి కృష్ణ గౌడ్,నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >