| Daily భారత్
Logo




కాంగ్రెస్ కావాలా... కరెంటు కావాలా...ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

News

Posted on 2023-11-09 12:17:42

Share: Share


కాంగ్రెస్ కావాలా... కరెంటు కావాలా...ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

డైలీ భారత్, సిరిసిల్ల :బిఆర్ఎస్ కు కంచుకోటలా ఉన్న సిరిసిల్లాలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో కేటీఆర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకనాటి కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంత రాజ్యంగా కావాలా....కరెంటు కాలాల కాంగ్రెస్ కావాలా...నీళ్ళు కావాలా కన్నీళ్లు కావాలా...కెసిఆర్ స్కీములు కావాలా...కాంగ్రెస్ స్క్యాములు కావాలా ఆలోచించండని కేటీఆర్ జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేశారు. 55 ఎండ్లు అధికారం ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ కు ఓటు వేస్తారా... సిరిసిల్లాను సంక్షేమంతోపాటు అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తారా ఆలోచించండన్నారు. తెలంగాణలో ప్రశ్నించే ఒకే ఒక గొంతుక కెసిఆర్ ను అనుచివేయాలని రాహుల్ గాంధీ వస్తున్నాడని విమర్శించారు. పది ఏండ్ల పాలనలో కెసిఆర్ ఎన్నడూ కుల రాజకీయాలు, మత విద్వాంసాలకు తెర తీయలేదని, ఇప్పుడు కుల, మత పిచ్చి గాల్లను ఓటు వేసి గెలిపించి వాటికి తావిద్దామా ఆలోచించాలని కోరారు. రాజకీయంగా జన్మనిచ్చి రాష్ట్రంలో,దేశంలో,  విదేశాల్లో గుర్తింపు నిచ్చింది సిరిసిల్ల అని సిరిసిల్ల ప్రజల ప్రజా ప్రతినిదిగా చెప్పుకోవడానికి గర్వ పడుతున్నానన్నారు. 15 ఏండ్లగా అవినీతి రహితంగా పని చేసి, సిరిసిల్ల ముఖ చిత్రం మార్చామన్నారు. ఐదవ సారి నామినేషన్ దాఖలు చేశానని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు కోసం  తిరుగుతున్నానని, గడప గడపకు తిరగక పోయిన ఇంటింటికి ప్రగతి నివేదిక పంపుతున్ననని, గులాబి దండు నాకు అండగా ఉందని గౌరవ ప్రదమైన మెజారిటీతో గెలిపిస్తారాని నమ్ముతున్నానన్నారు. గతంలో తప్పు చేసి 55 ఎండ్లు బాధపడ్డమని, మళ్ళీ తప్పు చేస్తే 50 ఎండ్లు బాధపడవలసి వస్తుందని గుర్తు చేశారు. ప్రలోబాలకు లొంగీ కాంగ్రెస్ కు ఓటు వేస్తే మళ్ళీ డిల్లీ మొచేతు నీళ్ళు తాగే పరిస్తితి వస్తదని, సిరిసిల్ల ప్రజలు చైతన్య వంతమైన ప్రజలని, సిరిసిల్ల ప్రజల కోసం పనిచేసిన నన్ను మళ్ళీ భారీ మెజారిటీతో గేలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు.

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >