Posted on 2024-09-09 15:50:48
డైలీ భారత్, పశ్చిమబెంగాల్ డెస్క్: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్ వైద్యులు మంగళవారం సాయంత్రం 5గంటల్లోపు తిరిగి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లేకపోతే ప్రతికూల చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
హత్యాచారం కేసుపై చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పశ్చిమ బెంగాల్‌లో 28రోజులుగా డాక్టర్లు సమ్మె చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
బెంగాల్ డాక్టర్లు తమ నిరసన విరమించాలని చంద్రచూడ్ మరోసారి కోరారు. ఈ సందర్భంగా వారి భద్రతకు హామీ ఉంటుందన్నారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు వైద్యులు విధు ల్లో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకో వద్దని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ వైద్యులు విధుల్లోకి రాక పోతే.. వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పింది.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >