Posted on 2023-11-08 13:55:06
కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్.
2,30,000/- రూపాయలు, బైక్ స్వాధీనం.
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : దొంగతనం కేసును సిరిసిల్ల పోలీసులు రెండు గంటల్లోనే చేదించారు. కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్ చేసి, వారి వద్ద 2,30,000/- రూపాయలు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈమేరకు బుదవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ నగర్ కి చెందిన సిలుముల రాజనర్సు అనే వ్యక్తి మంగళవారం పట్టణంలోని యూనియన్ బ్యాంక్ లో తన పెన్షన్ డబ్బులు 2,30,000/- రూపాయలు వేయడానికి నడుచుకుంటూ నటరాజ్ థియేటర్ దారిగుండ వెళ్ళే క్రమంలో పట్టణంలోని సుభాష్ నగర్ కవ్వంపెళ్ళి హరీష్, శాప అరవింధ్ ఇద్దరు బైక్ మీద వచ్చి, బండి వెనకాల కూర్చున్న ఒకరు బండి దిగి రాజనర్సు కొట్టి డబ్బులను లాక్కొని బండిపై పారిపోయినారని సిలుముల శంకర్ నారయణ ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే స్పందించిన సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ బి.ఉపేందర్ తన క్రైమ్ టీమ్ సిబ్బంది, సిసిఎస్ సిఐ రవీందర్, సిబ్బందితో కలిసి రెండు గంటల వ్యవదిలోనే సిరిసిల్లాలోని సుభాష్ నగర్ వాటర్ టాంక్ వద్ద పట్టుకొని, నిందితుల నుండి దొంగిలించిన 2,30,000/- రూపాయలు, మోటార్ సైకల్ ని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్పీ చెప్పారు. దొంగతనం కేసులో చాకచక్యంగా వ్యవహరించి రెండు గంటల్లో నిధుతులను పట్టుకున్న టౌన్ సిఐ ఉపేందర్, టాస్క్ఫోర్స్ సిఐ రవీందర్, సిబ్బంది పుల్కమ్ శ్రీనివాస్, శ్రీకాంత్, ఆక్సర్, తిరుపతి లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్పీ ఉదయ్ రెడ్డి, సిఐ ఉపేందర్, సిబ్బంది శ్రీనివాస్, శ్రీకాంత్, గోపాల్, నాగరాజు ఉన్నారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >