Posted on 2023-11-08 13:54:08
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ అధికారి గారికి వినతి పత్రం అందజేత జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సమ్మె కాలం వేతనాలను అందించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్లతో సిఐటియు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ సముదాయం లోని DPO జిల్లా పంచాయతీ అధికారి రవీందర్ గారికి వినతిపత్రాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య మాట్లాడుతూ గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం అహర్నిశలు ఎంతో కష్టపడి పని చేస్తూ గ్రామాలలో పారిశుద్ధ్యం మరియు ఇతర విభాగాలలో అతి తక్కువ వేతనాలు తీసుకుంటూ సేవలు అందిస్తున్న గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ప్రభుత్వం నెలనెలా సరిగా వేతనాలు ఇవ్వకుండా కార్మికులను , వారి కుటుంబాలను పస్తులు ఉండేటట్లు చేస్తుందని విమర్శించారు జిల్లాలో మూడు నెలల నుండి ఐదు నెలల వరకు కూడా పెండింగ్ వేతనాలు కార్మికులకు రావాల్సి ఉందని జీతాలు రాకుంటే కార్మికులు ఏ విధంగా వారి కుటుంబాలని పోషించుకుంటారని ప్రశ్నించారు ఇప్పటికైనా జిల్లాలో వేతనాలు బకాయిలు ఉన్న చోట్ల వెంటనే చెల్లించాలని సమ్మె కాలం వేతనాలను కూడా అందించాలని సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూషం రమేష్ , గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు బుర్ర శ్రీనివాస్ , లింగంపల్లి కృష్ణవేణి , లక్ష్మణ్ , అంజయ్య , నర్సయ్య , శ్రీనివాస్ , రవీందర్ , నరేష్ , చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >