ఆహారాన్ని నాణ్యతను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శశాంక.
విద్యార్థినిలకు సమస్యలు రాకుండా చూసుకోవాలి.
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జిల్లా కలెక్టర్ శశాంక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాలను శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థినిలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థినులకు అందిస్తున్న ఆహారాన్ని నాణ్యతను పరిశీలించారు. కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిలు తెలిపిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. విద్యార్థినిలతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి సుశిందర్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..