Posted on 2024-08-31 20:31:10
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మార్క్ ఫెడ్ లో ఎరువుల అమ్మకాలకి సంబంధించిన బకాయిల వసూలు విషయంలో అవతవకాలు గమనించిన యాజమాన్యం చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ హెడ్ ఆఫీస్ మమత కి ప్రిలిమినరీ ఎంక్వైరీ కి గత జూలై నెలలో ఆదేశాలు ఇవ్వగా వారు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేసి వేములవాడలో డిసిఎంఎస్ కి సంబంధించి 2022 ఏప్రిల్ నుండి 2024 మార్చి వరకు రూ. 76,77,325/- లు మార్క్ ఫెడ్ కి చెల్లించకుండా స్వంతానికి వాడుకున్నట్లు గుర్తించి హెడ్ ఆఫీస్ కి నివేదిక సమర్పించారు.
ఇదంతా రాజన్న సిరిసిల్ల మార్క్ ఫెడ్ లో పనిచేసే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ P రమేష్ గౌడ్ తన భార్య పేరుతో ఒక డిసిఎంఎస్ కోసం లైసెన్సు తీసుకొని దానికి ఎరువులు ను మార్క్ ఫెడ్ కి అడ్వాన్స్ నగదు చెల్లించి తీసుకోవాల్సి వుండగా,అకౌంటెంట్ భాస్కర్ సహాయంతో నగదు చెల్లించినట్లు బకాయిలు ఏమీ లేనట్లు స్టేట్మెంట్ తయారు చేపించి డిస్ట్రిక్ట్ మేనేజర్ అయిన దివ్య భారతి కి అన్ని సరిగా వున్నట్లు చూపించి ఎరువుల స్టాక్ ను పొంది బహిరంగ మార్కెట్ లో అమ్ముకొని అట్టి డబ్బులను తిరిగి చెల్లించకుండా 2022 నుండి 2024 మార్చి వరకు మొత్తంగా 76,77,325/- రూపాయలను స్వంత ఖర్చులకు వాడుకొని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. డిస్ట్రిక్ట్ మేనేజర్ దివ్య భారతి నిర్లక్ష్యంగా తన విధులు నిర్వర్తించడంతోనే సంస్థ కి ఇంత నష్టం వాటిల్లింది.
ఈ ఎంక్వైరీ జరిగిన తర్వాత హెడ్ ఆఫీస్ వాళ్ళు ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అయిన రమేష్ గౌడ్ మరియు భాస్కర్ లను ఉద్యోగంలోంచి తొలగించి డిస్ట్రిక్ట్ మేనేజర్ నీ సస్పెండ్ చేసి రమేష్ మరియు భాస్కర్ లపై వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా రూరల్ ఎస్.ఐ మారుతి విరిపై క్రిమినల్ కేసు ఫైల్ చేశారు.బకాయిల బాధ్యత మొత్తం డిస్ట్రిక్ట్ మేనేజర్ దే కాబట్టి కేసు నమోదు కంటే ముందే దివ్య భారతి రమేష్ పై రికవరీ కట్టాలని ఒత్తిడి తీసుకురాగా తన వద్ద డబ్బులు లేవని అనగా ప్రతిగా రమేష్ కి కరీంనగర్ లో బ్యాంక్ తాకట్టు లో వున్న ఇంటిని ఆ లోన్ నీ దివ్య భారతి కట్టి మార్టిగేజ్ రిలీజ్ చేసి దివ్య భారతి కుటుంబంలో ఒకరి పేరు మీద రిజిస్టర్ చేసుకుంది.నిధుల దుర్వినియోగానికి సంబంధించి పూర్తి బాధ్యత డిస్ట్రిక్ట్ మేనేజర్ దే కాబట్టి రమేష్ భాస్కర్ లతో పాటు దివ్యభారతి ని కూడా ఈ రోజు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >
తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం
Posted On 2026-05-24 21:12:46
Readmore >