Posted on 2024-08-31 10:51:13
డైలీ భారత్ ,రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో శనివారం ఉదయం కారు బీభత్సం సృష్టించింది, మైనర్ బాలుడు కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. లుమ్ముని మాల్ వద్ద పార్క్ చేసి ఉన్న కారు, ఆటోను ఢీకొట్టి కారు బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో కారు, ఆటో ధ్వంసమైయ్యాయి. అయితే.. ఆ సమయంలో అందులో ఎవరూ లేకపో వడంతో ప్రాణాపాయం తప్పింది.
స్థానికుల ఇచ్చిన సమాచా రం మేరకు పోలీసులు స్పాట్‌కి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం సమయంలో కారు నడిపింది మైనర్‌గా గుర్తించారు
పోలీసులు.. కాగా.. అక్కడున్న సీసీ కెమెరాలో కారు బీభత్సం దృశ్యాలు రికార్డు అయ్యా యి. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతు న్నాయి. ఇప్పటికే ఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..
తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం
Posted On 2026-05-24 21:12:46
Readmore >
ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2026-05-24 12:27:09
Readmore >
వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు
Posted On 2026-05-24 11:06:50
Readmore >