| Daily భారత్
Logo




ఆంధ్ర పోలీసులు అక్రమ కేసు పెట్టి వేధించారు.....నా దగ్గరున్న ఆధారాలన్నీ ఇస్తా : కాదంబరీ జత్వానీ

News

Posted on 2024-08-30 12:43:43

Share: Share


ఆంధ్ర పోలీసులు అక్రమ కేసు పెట్టి వేధించారు.....నా దగ్గరున్న ఆధారాలన్నీ ఇస్తా : కాదంబరీ జత్వానీ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఏపీ పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారంటూ ఆరోపించింది బాలీవుడ్ సినీ నటి కాదంబరీ జత్వానీ. తన దగ్గర ఉన్న ఆధారాలన్ని ఏపీ ప్రభుత్వానికి ఇస్తానంటూ చెప్పుకొచ్చింది. పోలీసులు తన ఫ్యామిలీని, తనని అక్రమంగా అరెస్ట్‌ చేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నానని వెల్లడించారు జత్వానీ. ఇప్పటికే ఏపీ పోలీసు అధికారుల తీరుపై తీవ్ర ఇబ్బందులు పడ్డానంటూ కాదంబరీ జత్వానీ మీడియా ముందు కన్నీళ్లపర్యంతం అవ్వడం, ఈ వ్యవహారం మీడియాలో ప్రముఖంగా రావడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. గత ప్రభుత్వం నటి కాదంబరీ జత్వానీపై నమోదు చేసిన కేసుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కాగా కాదంబరీ జత్వానీ ఈ రోజు విజయవాడకు వెళ్లి పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌ బాబును కలవనున్నారు. తనపై నమోదు చేసిన అక్రమ కేసులపై వివరణ ఇవ్వనున్నారు. గురువారం రాత్రే శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమె.. రాత్రి హైదరాబాద్‌లో బస చేశారు.. ఇక, హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

Image 1

అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 10:43:55

Readmore >
Image 1

నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా సిరికొండ సుదర్శన చారి

Posted On 2026-05-25 09:07:34

Readmore >
Image 1

అక్రమ రేషన్ పట్టివేత...

Posted On 2026-05-25 09:04:41

Readmore >
Image 1

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

Posted On 2026-05-25 09:02:29

Readmore >
Image 1

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత

Posted On 2026-05-25 08:30:40

Readmore >
Image 1

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Posted On 2026-05-24 21:12:46

Readmore >
Image 1

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి

Posted On 2026-05-24 21:10:41

Readmore >
Image 1

ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

Posted On 2026-05-24 12:27:09

Readmore >
Image 1

వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

Posted On 2026-05-24 11:06:50

Readmore >
Image 1

కోదాడలో నార్కోటిక్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

Posted On 2026-05-24 11:00:55

Readmore >