| Daily భారత్
Logo




లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా... ఆందోళనలో విద్యార్థులు

News

Posted on 2024-08-30 08:19:50

Share: Share


లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా... ఆందోళనలో విద్యార్థులు

డైలీ భారత్, గుడ్లవల్లేరు: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోర దుర్ఘటన.

లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టుబడింది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

అందిన సమాచారాన్ని బట్టి సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్కు చేరినట్లు వినికిడి. వీటిని బాయ్స్ హాస్టల్కు చెందిన కొంతమంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా గర్ల్స్ హాస్టల్ కు చెందిన ఒక స్టూడెంట్ సహకారంతో బాయ్స్ హాస్టల్ కు చెందిన కొంతమంది ఈ దుర్ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఇంజనీరింగ్ కళాశాలలో గర్ల్స్ న్యాయం కోరుతూ ఉయ్ వాంట్ జస్టిస్ అనే నినాదాలతో కళాశాల ప్రాంగణమంతా దద్దరిల్లేలా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాగా విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం శాయశక్తుల కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కళాశాలలోని విద్యార్థులు వాష్ రూమ్ కు వెళ్లాలంటే భయంతో గడగడలాడిపోతున్నారు.  నిందితులు ఎలాంటి వారైనా బహిరంగంగా ఉరితీయాలనే డిమాండ్ తల్లిదండ్రుల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నిందితులను బహిరంగంగా కఠినంగా శిక్షించాలని ఇటువంటి చర్యలకు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా తక్షణ శిక్షలను అమలు చేయాలనే డిమాండ్ అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తం అవుతుంది....

Image 1

అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 10:43:55

Readmore >
Image 1

నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా సిరికొండ సుదర్శన చారి

Posted On 2026-05-25 09:07:34

Readmore >
Image 1

అక్రమ రేషన్ పట్టివేత...

Posted On 2026-05-25 09:04:41

Readmore >
Image 1

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

Posted On 2026-05-25 09:02:29

Readmore >
Image 1

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత

Posted On 2026-05-25 08:30:40

Readmore >
Image 1

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Posted On 2026-05-24 21:12:46

Readmore >
Image 1

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి

Posted On 2026-05-24 21:10:41

Readmore >
Image 1

ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

Posted On 2026-05-24 12:27:09

Readmore >
Image 1

వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

Posted On 2026-05-24 11:06:50

Readmore >
Image 1

కోదాడలో నార్కోటిక్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

Posted On 2026-05-24 11:00:55

Readmore >