| Daily భారత్
Logo




తిరుమల తరహాలో వేములవాడలో నిత్యాన్నదానం

News

Posted on 2024-08-29 19:50:04

Share: Share


తిరుమల తరహాలో వేములవాడలో నిత్యాన్నదానం

సత్రం నిర్మాణానికి దాతలు సహకరించాలి: మంత్రి పొన్నం

సత్రం నిర్మాణానికి దాతలు సహకరించాలి: పొన్నం

ఆలయాభివృద్ధికి 50 కోట్లు కేటాయించాం: ఆది శ్రీనివాస్

డైలీ భారత్, వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవాలయంలో తిరుమల తరహాలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ తో కలసి బుధవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించారు. స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ గోదాం, కేడీసీసీ బ్యాంక్ బ్రాంచ్భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అన్నదాన సత్రం ఏర్పాటుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి, సహకరించాలని కోరారు.

రాజన్న ఆలయ అభివృద్ధికి శృంగేరి పీఠం, పండితులు, భక్తుల సూచనల మేరకు ముందుకు వెళ్తామని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం, మంత్రులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. సహకార సంఘాలు రాజకీయాలకతీతంగా రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రుణమాఫీకాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైనవారికి తప్పకుండా రుణమాఫీ అమలుచేస్తామని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో 59 వేల మంది రైతులకు 444 కోట్లు రుణమాఫీ అయిందని వెల్లడించారు. ఈ ఏడాది శ్రావణ మాసం ఆరంభం నుంచి భక్తుల కోసం బ్రేక్ దర్శనాన్ని అమల్లోకి తీసుకువచ్చామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటిదాకా 1400 మంది భక్తులు దర్శించుకోగా, దాదాపు రూ. 15 లక్షల ఆదాయం సమకూరిందని చెప్పారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్లు కేటాయించిందని చెప్పారు.

Image 1

అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 10:43:55

Readmore >
Image 1

నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా సిరికొండ సుదర్శన చారి

Posted On 2026-05-25 09:07:34

Readmore >
Image 1

అక్రమ రేషన్ పట్టివేత...

Posted On 2026-05-25 09:04:41

Readmore >
Image 1

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

Posted On 2026-05-25 09:02:29

Readmore >
Image 1

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత

Posted On 2026-05-25 08:30:40

Readmore >
Image 1

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Posted On 2026-05-24 21:12:46

Readmore >
Image 1

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి

Posted On 2026-05-24 21:10:41

Readmore >
Image 1

ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

Posted On 2026-05-24 12:27:09

Readmore >
Image 1

వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

Posted On 2026-05-24 11:06:50

Readmore >
Image 1

కోదాడలో నార్కోటిక్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

Posted On 2026-05-24 11:00:55

Readmore >