| Daily భారత్
Logo




దీర్ఘకాలిక ఆర్థిక బకాయిలు విడుదల చేయాలి :ఎస్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం పర్వత రెడ్డి

News

Posted on 2023-11-05 13:45:31

Share: Share


దీర్ఘకాలిక ఆర్థిక బకాయిలు విడుదల చేయాలి :ఎస్ టి యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం పర్వత రెడ్డి

డైలీ భారత్ సిరిసిల్ల :రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన STU రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులుగా మొగలి లక్ష్మణ్

ప్రధాన కార్యదర్శి గా రేవోజు సదానందం

రాష్ట్ర కార్యదర్శిగా చాట్ల మల్లేశం

దీర్ఘకాలికంగా పెండింగ్ లోనున్న ఆర్థిక బకాయిలు తక్షణమే విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం పర్వత రెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం సిరిసిల్ల సంఘ కార్యాలయంలో ఎస్టియు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై ఎం పర్వత రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో వేతనాలు పెండింగ్ లోనున్న బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణను ప్రముఖ రాజకీయ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో చేర్చాలని కోరారు.  అనంతరం నిలిచిపోయిన బదిలీలు పదోన్నతులు ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో నిర్వహించాలని,  అల్పాహార పథకంనకు సంబంధించి పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు.  ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు మొగిలి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి రేవోజు సదానందం సంఘ కార్యకలాపములను నివేదికను ప్రవేశపెట్టారు.  ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు నరసింహారెడ్డి,  శ్రీధర్,  రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుకూరి దయానంద్, ఎన్నికల అధికారి పట్నం భూపాల్,  రాష్ట్ర కార్యదర్శి చాట్ల మల్లేశం, జిల్లా కార్యదర్శులు, అన్ని మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 2023 - 25 సంవత్సరానికి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండవసారి ఎస్టియు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా మొగిలి లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రేవోజు సదానందం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పట్నం భూపాల్ ఎన్నికల పరిశీలకులు శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.


Image 1

రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం

Posted On 2026-08-15 18:03:53

Readmore >
Image 1

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Posted On 2026-08-15 17:53:10

Readmore >
Image 1

16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust

Posted On 2026-08-15 17:50:48

Readmore >
Image 1

గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు

Posted On 2026-08-15 17:49:14

Readmore >
Image 1

సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 16:56:59

Readmore >
Image 1

విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు

Posted On 2026-08-15 16:55:47

Readmore >
Image 1

మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ

Posted On 2026-08-15 16:54:31

Readmore >
Image 1

స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి

Posted On 2026-08-15 16:53:32

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >