| Daily భారత్
Logo




దారుణం ... ప్రియురాలిని కారులో బంధించి రోడ్డుపైనే అఘాయిత్యం.

News

Posted on 2023-11-05 14:15:38

Share: Share


దారుణం ... ప్రియురాలిని కారులో బంధించి రోడ్డుపైనే అఘాయిత్యం.

డైలీ భారత్, హైదరాబాద్:  వారిద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు... ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. హటాత్తుగా ఏమయ్యిందో తెలీదు ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి ప్రాణాలు తీసేందుకు సదరు ప్రియుడు ప్రయత్నించాడు.కారులో బంధించి ప్రియురాలిపై కత్తితో దాడిచేసి ఆ తర్వాత తానుకూడా కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఏఈ కాలనీకి చెందిన మెరుగు వంశీ(21), మౌలాలి ఎంజే కాలనీకి చెందిన యువతి చిన్నప్పటి నుండి క్లాస్ మేట్స్. ఒకే స్కూల్లో చదువున్న సమయంలో చిగురించిన స్నేహం టీనేజ్ కు వచ్చేసరికి ప్రేమగా మారింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ కీసరలోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ఫైనలియర్ చదువుతున్నారు.

చాలాకాలంగా వీరిమధ్య ప్రేమ వ్యవహారం సాగుతుండగా హటాత్తుగా ఏమయ్యిందో తెలీదు యువతి మనసు మార్చుకుంది. ఇకపై తనకు దూరంగా వుండాలని... ఇక్కడితో ప్రేమ వ్యవహారాన్ని మరిచిపోవాలని ప్రియుడికి చెప్పింది. ఒక్కసారిగా ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో వంశీ తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో సైకోలా మారిన అతడు ప్రియురాలిని చంపి తానుకూడా సూసైడ్ చేసుకోవాలని దారుణ నిర్ణయం తీసుకున్నాడు. నిన్న (శనివారం) తన ప్రియురాలికి ఫోన్ చేసి చివరిసారిగా ఓసారి మాట్లాడాలని చెప్పి బయటకు పిలిచాడు వంశీ. ఇద్దరూ కలిసి డిఏఈ కాలనీకి కారులో వెళ్లారు. ఓ చోట కారు ఆపిన వంశీ వెంటతెచ్చుకున్న కత్తితీసి ప్రియురాలిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆమె కడుపు, మెడ భాగంలో గాయాలవడంతో ప్రాణభయంతో కేకలు వేసింది. దీంతో కారుచుట్టు జనాలు గుమిగూడటంతో వంశీ తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇలా ఇద్దరి రక్తంతో కారంతా రక్తసిక్తం అయ్యింది. 

కారుచుట్టు చేరినవారు వెంటనే విండో అద్దాలు పగులగొట్టి డోర్ తెరిచారు. వెంటే ఇద్దరిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. వెంటనే వైద్యం అందడంతో ఇద్దరి ప్రాణాలకు హాని తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Image 1

రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం

Posted On 2026-08-15 18:03:53

Readmore >
Image 1

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు

Posted On 2026-08-15 17:53:10

Readmore >
Image 1

16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust

Posted On 2026-08-15 17:50:48

Readmore >
Image 1

గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు

Posted On 2026-08-15 17:49:14

Readmore >
Image 1

సాయి ఎక్సలెంట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 16:56:59

Readmore >
Image 1

విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు

Posted On 2026-08-15 16:55:47

Readmore >
Image 1

మూడు ప్రాంతాల్లో ఫ్రీజర్‌ బాక్సుల పంపిణీ

Posted On 2026-08-15 16:54:31

Readmore >
Image 1

స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాభివృద్ధికి కృషి చేయాలి

Posted On 2026-08-15 16:53:32

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 13:43:20

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >