Posted on 2023-11-05 04:28:29
డైలీ భారత్, శబరిమల: శబరిమలలోని అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకుడిగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మువట్టుపుజాకు చెందిన పీఎన్ మహేశ్‌ను నియమించింది. మహేష్ ప్రస్తుతం త్రిసూర్‌లోని పారమెక్కావు ఆలయానికి మెల్శాంతిగా పనిచేస్తున్నారు.
వార్షిక మండల-మకరవిళక్కు సీజన్ ప్రారంభానికి ముందు మహేశ్ ను ప్రధాన అర్చకుడిగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నియమించింది. మహేశ్ మువాట్టుపుజాలోని పుత్తిల్లత్ ప్రాంతానికి చెందినవాడు. తనకు లభించిన అవకాశాన్ని దైవ భాగ్యంగా భావిస్తున్నానని మహేశ్ తెలిపారు.
గురువాయూర్ సమీపంలోని అంజూర్ పూంగట్ మనాకు చెందిన పిజి మురళి శబరిమల ప్రాంగణంలోని మాలికాపురత్తమ్మ అమ్మవారి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా (మేల్శాంతి) ఎంపికయ్యారు. గతంలో హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని అయ్యప్ప స్వామి ఆలయ ప్రధాన అర్చకుడిగా 25 ఏళ్లుగా సేవలందించారు.
శబరిమల ఆలయ కేరళ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అయిన ట్రావెన్‌కోర్ దేవస్థానమ్ బోర్డ్ (TDB) శబరిమల ఆలయ ప్రదాన అర్చకుల (ఏడాది కాలం పాటు) పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించింది. షార్ట్ లిస్ట్ అనంతరం పూజారుల ప్యానెల్ నుంచి లాటరీ ద్వారా ఇద్దరు ప్రదాన అర్చకులను ఎంపిక చేస్తారు. పందళం రాజ కుటుంబానికి చెందిన వైదే వర్మ.. నిరుపమ జి వర్మ .. శబరిమల,, మాలికాపురత్తమ దేవి అమ్మవారి ఆలయాల అర్చకుల కోసం TDB అధికారుల సమక్షంలో లాటరీ పద్దతి ద్వారా పీఎన్ మహేశ్ , పీజీ మురళీ లను ఎంపిక చేశారు.మండల పూజల నిమిత్తం శబరిమల ఆలయం నవంబర్ 2 వ తేదీన TDB బోర్డు అధికారులు తెరిచారు. తంత్రి కాంతారావు.. ప్రధాన అర్చకులు మహేశ్ సమక్షంలో.. నంబూద్రి కె. జయరామన్ ఆలయాన్ని ఓపెన్ చేశారు. మాలికాపురత్తమ దేవి ఆలయ తాళాలను ప్రధాన అర్చకుడు వి హరిహరన్ కు అందజేశారు.
తులమాస పూజల కోసం శబరిమల ఆలయం మంగళవారం తెరుచుకుంది. తంత్రి కాంతారావు మహేశ్‌మోహన్ సమక్షంలో ప్రధాన అర్చకులు కె.జయరామన్ నంబూతిరి ఆలయాన్ని ప్రారంభించారు. అదనంగా, ఆలయ ప్రారంభోత్సవం కోసం మలికప్పురం ఆలయ తాళాలను ప్రధాన అర్చకుడు వి హరిహరన్‌కు అందజేశారు
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >