Posted on 2024-08-09 17:43:15
షాద్ నగర్ పట్టణంలో విస్తృత తనిఖీలు చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంగస్వామి
వ్యాపార సంస్థలు, లాడ్జిలు, ఇతర వ్యాపార సముదాయాలలో భారీగా తనిఖీలు
డ్రగ్స్, గుట్కా, గంజాయి లాంటి నిషేధిత పదార్థాలపై డేగ కన్ను
ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సమాజంలో ప్రజల రక్షణ కోసం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్రమ కార్యకలాపాలపై
అసాంఘిక శక్తులపై నిరంతరం పోలీసుల డేగ కన్ను ఉంటుందని షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎసిపి రంగస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు నిరంతరంగా ఆయా వ్యాపార కార్యకలాపాలపై ముమ్మర తనిఖీలు నిర్వహించారు. వీటితోపాటు పట్టణంలో రద్దీ ప్రాంతాలైన ఆర్టీసీ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా కిరాణా షాపులు పాన్ షాపులు లాడ్జిలు ఇతర వ్యాపార సముదాయాలలో భారీగా పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. కిరాణా షాపులు పాన్ షాపులలో గుట్కా ఇంకా ఇతర మత్తు పదార్థాల అమ్మకాలపై ఎసిపి రంగస్వామి ఆరా తీశారు. పట్టణ సీఐ విజయ్ కుమార్ తో పాటు రూరల్ సిఐ సత్యనారాయణతో కలుపుకొని మొత్తం వందమంది సిబ్బందితో పట్టణంలో వ్యాపార కార్యకలాపాలపై పోలీసులు జల్లెడ పట్టారు.
అక్రమ కార్యక్రమాలపై నిఘా.. ఏసిపి
అక్రమ కార్యకలాపాలపై పోలీసులు పెద్ద ఎత్తున నిఘా సాధించినట్లు స్థానిక ఏసిపి రంగస్వామి తెలిపారు. పట్టణంలో జరుగుతున్న సోదరులపై మీడియా ఏసీపీ రంగస్వామి వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలతో పాటు డ్రగ్స్ గుట్కా ఇతర మత్తు పదార్థాల క్రయవిక్రయాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. లాడ్జింగ్ లలో అపరిచిత వ్యక్తుల ఆశ్రయం, రద్దీ ప్రాంతాలలో దొంగలు పాత నేరస్తుల కదలికలు అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించినట్లు ఎసిపి తెలిపారు. సాధారణ తన హీరో భాగంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఐపీఎస్ అదేవిధంగా శంషాబాద్ డిసిపి రాజేష్ ఆదేశాల మేరకు పట్టణంలో గట్టి పోలీసునిగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అసాంఘిక కార్యక్రమాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించవచ్చని వారి పేర్లు కూడా గోప్యంగా ఉంచుతామని అన్నారు. గంజాయి నిషేధిత గుట్కా ఇతను మత్తు పదార్థాలను వాడకూడదని అసాంఘిక కార్యకలాపాలు చేపట్టకూడదని ఏసీపీ హెచ్చరించారు. నిరంతరం ప్రజల సహాయార్థం పోలీసులు పని చేస్తారని తెలిపారు. ఇలాంటి అనుమానాలు ఉన్న పోలీసు దృష్టికి తీసుకురావచ్చు అని తెలిపారు..
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >