Posted on 2024-08-09 15:33:24
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి. శ్రీను నాయక్
సిఐటియు, సంయుక్త కిసాన్ మోర్చ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కార్మిక, ప్రజావ్యతిరేక బడ్జెట్ ను నిరసిస్తూ ప్లకార్డ్స్ ప్రదర్శన నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి. శ్రీను నాయక్ మాట్లాడుతూ..
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం అని ఆగస్టు 9న 1942లో ఈ దేశాన్ని వదిలి వెళ్ళండి అని తెల్లదొరలకు పిలిపిస్తే, నేడు నరేంద్ర మోడీ ఎర్ర తివాచీ పరఛి విదేశీ గుప్త కంపెనీలకు స్వాగతం పలుకుతున్నారని విమర్శించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రకటించాలన్నారు .కేంద్రంలో మూడవసారి అధికారం చేపట్టిన వెంటనే బిజెపి నాయకత్వం లోని ఎన్డీఏ ప్రభుత్వం తన నయా వూ దారవాద సంస్కరణలను దూకుడుగా కొనసాగించడానికి వందరోజుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అందుకే తమకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని మోడీ ప్రభుత్వం చాటుకుంటుంది.
లేబర్ కోడ్లను నోటిఫై చేయడం, భారతీయ న్యాయ సంహిత 2023 ను అమలు చేయడం, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ద్వారా పెద్ద కార్పొరేట్లకు ఆర్థిక వెసులుబాట్లు కల్పించే చర్యలు వేగవంతం చేసింది. పరిపాలనలోకి వచ్చిన 20 రోజుల్లోనే మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎనిమిది మంది మైనార్టీ మతస్తుల మీద మూకదాడులు కు దిగడం ద్వారా ఆర్ఎస్ఎస్ దాని హిందుత్వ మత శక్తులు తమ మత విద్వేష కార్యక్రమాన్ని కొనసాగిస్తామని హెచ్చరిక చేశాయి. సామాన్యులకు మాటల్లో, సంపన్నులు ,కార్పొరేట్లకు మూటలు వడ్డించే విధంగా మోడీ ప్రభుత్వం కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. అత్యంత కీలకమైన వ్యవసాయ, పారిశ్రామిక రంగానికి ఈ బడ్జెట్ ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. కానీ అన్ని రంగాల్లో కార్పొరేట్లకే పెద్ద పీట దక్కిందన్నారు .ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటీకరణ లో భాగంగా సింగరేణి 61 బ్లాక్ లను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. మన ఓట్లతో తెలంగాణ నుండి పార్లమెంటుకు వెళ్లిన కిషన్ రెడ్డి బొగ్గు బ్లాక్ ల మంత్రిగా ఉండి తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని శ్రావణ్ పల్లి బొగ్గు బ్లాక్ ను వేలం పాట పాడటం ఎంతవరకు సమంజసం అని విమర్శించారు. దేశంలోని అన్ని రంగాల కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కనీస పెన్షన్ 10000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ రైతు సంఘం నాయకుడు పద్మా రెడ్డి సిఐటియు. జిల్లా నాయకులు లలిత బేరి శ్రీనివాస్, మీది పేట రాజశేఖర్, కావలి రాజు, కురుమయ్య, మహమ్మద్ బాబు జంగయ్య, జంగమ్మ. లక్ష్మమ్మ, చెన్నమ్మ, నర్సమ్మ, పద్మమ్మ . రాజు సుఖమ్మ, నర్సింలు ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు భుజంగారెడ్డి భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మైలారం జంగయ్య తదితరులు పాల్గొన్నారు..
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య
Posted On 2025-06-22 07:22:22
Readmore >ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
Posted On 2025-06-22 05:24:12
Readmore >టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్
Posted On 2025-06-21 17:19:52
Readmore >