| Daily భారత్
Logo




పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది

News

Posted on 2024-08-08 23:16:34

Share: Share


పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో

స్పెయిన్‌పై గెలుపొందింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్‌ చేసి భారత్‌ విజయంలో కీలకపాత్ర

పోషించాడు. దీంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. తొలి క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్‌ చేయలేకపోయాయి. రెండో

క్వార్టర్‌ ఆరంభంలో (18వ నిమిషం) స్పెయిన్‌ ఆటగాడు మార్క్‌ మిరల్లెస్‌ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మార్చాడు. దీంతో ఆ జట్టు ఆధిక్యంలోకి

వెళ్లింది. 29వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్మర్‌ లభించింది. దానిని హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలిచేందుకు ప్రయత్నించినా స్పెయిన్‌ గోల్‌కీపర్‌ అడ్డుకున్నాడు.

వెంటనే మరో పెనాల్టీ కార్చర్‌ లభించగా భారత్‌ దానిని సద్వినియోగం చేసుకుంది. ఈ సారి హర్మన్‌ప్రీత్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతి

గోల్‌ పోస్ట్‌లోకి పంపి స్కోరును 1-1తో సమం చేశాడు. మూడో క్వార్టర్‌ మొదలైన కాసేపటికే పెనాల్టీ కార్బర్‌తో హర్మన్‌ప్రీత్‌ మరో గోల్‌ చేశాడు.

దీంతో భారత్‌ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత మూడు పెనాల్టీ కార్చర్‌లు సాధించిన ఇండియా వాటిని గోల్ఫ్‌గా మలచలేకపోయింది. మ్యాచ్‌ మరో నిమిషంలో ముగుస్తుందనగా స్పెయిన్‌కు ఓ పెనాల్టీ కార్మర్‌ లభించింది. భారత గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ దానిని అద్భుతంగా అడ్డుకున్నాడు. 60వ నిమిషంలో ప్రత్యర్థికి మరో పెనాల్టీ కార్చర్‌ రాగా... సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఒలింపిక్స్‌లో భారత్‌ 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు

కాంస్య పతకాలు దక్కించుకుంది. టోక్యో ఒలిపిక్స్‌లోనూ భారత్‌ కాంస్యం గెలిచింది. అంతకుమందు 1968, 1972లో టీమ్‌ఇండియా కంచు మోగించింది.

ఉద్వేగానికి గురైన శ్రీజేశ్‌ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన శ్రీజేశ్‌ భారత్‌ గెలిచిన అనంతరం ఉద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో గోల్‌ పోస్టు ఎక్కి సంబరాలు చేసుకున్నాడు. భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ అతడిని తన భుజాలపై ఎత్తుకుని మైదానమంతా కలియ తిరిగాడు. ఇతర ఆటగాళ్లు కూడా శ్రీజేశ్‌ను అభినందించారు.

Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >