| Daily భారత్
Logo




సూర్యాపేట లో ఠాగూర్ సీన్ రిపీట్... ప్రాణం ఖరీదు అరవై వేలు

News

Posted on 2024-08-08 23:12:17

Share: Share


సూర్యాపేట లో ఠాగూర్ సీన్ రిపీట్... ప్రాణం ఖరీదు అరవై వేలు

చనిపోయిన పేషెంట్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం

ప్రభుత్వ  వైద్యాన్ని కించపరిచే ప్రయత్నం చేసిన ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు

ప్రవేట్ హాస్పటల్స్ పై చర్యలు తీసుకొని అధికారులు, నాయకులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఠాగూర్ సినిమాలోని సీన్ ను రిపీట్ చేసింది. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన వ్యక్తికి మొదట ఓ ఇంజక్షన్ వేసి అపస్మార్క స్థితిలోకి తీసుకెళ్లిన సిబ్బంది అనంతరం మరో ఇంజక్షన్ వేసి. అతని మృతికి కారణమయ్యారు. ఈ విషయం మృతుని బంధువులకు తెలిసేలోపు మృతుని అంబులెన్స్ లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి అక్కడే చనిపోయినట్లు ప్రభుత్వ వైద్య0 పై నెట్టేందుకు ప్రయత్నం చేశారు. మృతి చెందిన వ్యక్తిని బంధువులకు సైతం సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ జనరల్  ఆసుపత్రికి తరలించడం వెనుక ఆంతర్యం ఏమిటని బంధువులు ప్రశ్నించడంతో ఆస్పత్రి నిర్వహకులు నీళ్లు మింగిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన శివరాత్రి ఇద్దయ్య, 62 సంవత్సరాల వయస్సు జమ్మిగడ్డలో ని హెల్తీ పై ప్రైవేట్ ఆసుపత్రిలో మోకాలి నొప్పి చికిత్స కోసం చేరాడూ.  అయితే ఆసుపత్రి సిబ్బంది పేషెంట్ కు మొదట ఒక ఇంజక్షన్ వేయడంతో అపస్మాక స్థితిలోకి వెళ్ళాడు. దీంతో ఏదో జరుగుతుందని గమనించి మరో ఇంజక్షన్ వేయడంతో రోగి మృతి చెందాడు. ఈ విషయాన్ని ఆసుపత్రి నిర్వాహకులు కప్పిపుచ్చుకునేందుకు ఠాగూర్ సీన్ ను క్రియేట్ చేశారు.  బంధువులకు సమాచారం ఇవ్వకుండా చనిపోయిన పేషెంట్ ను సైలెంట్ గా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కి తరలించారూ. తమకు  చెప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కు మృతున్ని తరలించారని ఆస్పత్రి సిబ్బంది వేసిన ఇంజక్షన్ల వల్లనే రోగి మృతి చెందాడని దీని కప్పిపోవచ్చినందుకు ఏరియా ఆసుపత్రికి తరలించారని రోగి బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు.

Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >