| Daily భారత్
Logo




శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పుష్కరిని వద్ద టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలగంటి మధుసూదన్ రెడ్డితో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

News

Posted on 2024-08-06 16:21:43

Share: Share


శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పుష్కరిని వద్ద టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలగంటి మధుసూదన్ రెడ్డితో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే కాలే యాదయ్య

స్వచ్ఛదనం....పచ్చదనం నిరంతర ప్రక్రియ

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

స్వచ్ఛతను పచ్చదనం మన అందరి బాధ్యత

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలగంటి మధుసూదన్ రెడ్డి

పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు, ప్రభుత్వ సిబ్బంది,  పౌరులు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సమాజంలో స్వచ్ఛదనం, పచ్చదనం రెండు నిరంతర ప్రక్రియాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య  అన్నారు. అదేవిధంగా స్వచ్ఛతనం.. పచ్చదనం కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదని ఇది ప్రజలందరి బాధ్యత అన్నారు.

స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పుష్కరిని వద్ద  ఎంపీడీవో హిమ బిందు సారధ్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం పచ్చదనం ఐదు రోజుల కార్యక్రమానికి ప్రారంభోత్సవ సభ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కాలే యాదయ్య ,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలగంటి మధుసూదన్ రెడ్డి  , ప్రజలు ప్రభుత్వ ఆయా శాఖలకు సంబంధించిన సిబ్బంది హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్యక్రమాలు ఒక ఉద్యమంలా చేపట్టాలని అన్నారు. పారిశుద్ధ్య, పచ్చదనం, స్వచ్ఛదనం కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి ఇంటికి ఒక మొక్క ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకుంటే ఇంటి అనుమతులు సులభతరం చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ఎమ్మెల్యే యాదయ్య గారుసూచించారు.  ప్రభుత్వం చెప్పిందని మొక్కలు అవసరం లేని చోట నాటుకుంటూ పోతే వాటిని కొందరు తీసుకుంటూ పోతారని అలా కాకుండా అవసరమైన చోట మాత్రమే మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే యాదయ్య గారు సూచించారు. ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని ప్రజలను భాగస్వాములు చేసుకుంటూ వారిని ఆలోచింపజేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రూపొందించి దానికి అనుగుణంగా పనులు చేపట్టాలని ఎమ్మెల్యే యాదయ్య  సూచించారు.

Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >