| Daily భారత్
Logo




ఆస్తికోసం కన్న తల్లిదండ్రులను వేధిస్తున్న సీఐ

News

Posted on 2024-08-06 11:47:45

Share: Share


ఆస్తికోసం కన్న తల్లిదండ్రులను వేధిస్తున్న సీఐ

డైలీ భారత్, హైదరాబాద్: కన్న కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని రాష్ట్ర డీజీపీకి ఓ పోలీసు అధికారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన స్థాయిలో ఉండి కూడా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులని కూడా చూడకుండా తమ కుమారుడు సీఐ నాగేశ్వర్​ రెడ్డి వేధిస్తున్నాడని బాధితులు​ వాపోయారు. వనపర్తి జిల్లా ఖల్లా ఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్​ రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి సీఐగా విధులు నిర్వహిస్తుండగా, చిన్న కుమారుడు యాదయ్య కానిస్టేబుల్​గా పని చేస్తున్నారని వారు తెలిపారు. అయితే రఘునాథ్​ రెడ్డికి ఉన్న 30 ఎకరాల 23 గుంటల భూమిని పెద్ద కుమారుడి పేరుపై 15 ఎకరాలు, చిన్న కుమారుడి పేరుపై 11 ఎకరాలు రాసిచ్చినట్లు, మిగిలిన భూమిని కుమార్తెలకు ఇచ్చేందుకు ఉంచుకున్నట్లు పేర్కొన్నారు.

ఆ విషయంపై అతని పెద్ద కుమారుడు సీఐ అయిన నాగేశ్వర్ రెడ్డి తన పేరుపై ఇంకో ఐదెకరాల భూమి రాయించాలని ఒత్తిడి చేశారని, అది వినకపోయేసరికి పలుమార్లు తమను దూషించడంతో పాటు దాడి చేసినట్లు వృద్ధ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. పెద్ద కుమారుడి వేధింపులు తాళలేక తమ చిన్న కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. ప్రస్తుతం తమ పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు. తన కుమారుడు నాగేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకొని, తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు.

Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >
Image 1

ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"

Posted On 2026-06-30 13:21:42

Readmore >
Image 1

చీరతో చేతులు కట్టేసి మరీ... భర్తను నరికి చంపిన భార్య...

Posted On 2026-06-30 08:55:26

Readmore >
Image 1

ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య

Posted On 2026-06-30 08:20:14

Readmore >