Posted on 2024-08-06 11:20:33
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: బంగ్లాదేశ్ దేశం వివిధ రాష్ట్రంలో నెలల తరబడి నిరసనలు.. ఆందో ళనలతో రగిలిపోయిన రచ్చలో వందలాది మంది మృతి. కొన్నాళ్లుగా రిజర్వే షన్ల గొడవతో అట్టుడికిన బంగ్లాదేశ్ చివరకు సైనిక పాలనలోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హాసీనా గద్దె దిగాల్సి వచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతి యుతంగా మొదలైన నిరసనలు.. ఊహించని పరిణామాలకు దారితీ శాయి. దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో షేక్ హసీనా ప్రభుత్వం వణికిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరకు దేశ ప్రధాని గద్దెదిగాల్సి వచ్చింది.
కొన్ని నెలలుగా జరుగుతోన్న ఆందోళన.. రెండు, మూడ్రో జుల నుంచి మరింత హింసాత్మకంగా మారాయి. ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడించారు ఆందోళన కారులు. పరిస్థితి చేయిదా టిపోవడంతో చివరకు షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
తన సోదరి షేక్ రెహానాతో కలసి ఆర్మీ హెలికాప్టర్‌లో దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు.
45 నిమిషాల గడువు
పరిస్థితులు ఆందోళన కరంగా మారడంతో షేక్ హసీనాను ప్రధాని పదవికి రాజీనామా చేయాలని ఆర్మీ 45 నిమిషాల గడువు పెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాదు భద్రతా కారణాల దృ ష్ట్యా దేశం వెడిచి వెళ్లాలని చెప్పినట్లు సమాచారం.
అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేయగానే ఆమె భారత్‌కు చేరుకున్నారు. యూపీలోని ఘజియాబాద్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్న షేక్ హసీనా లండన్‌కు వెళ్లారు.షేక్ హసీనా బంగ్లా దేశ్‌ను వదిలివెళ్లిన తర్వాత ఆమె ఇంట్లోకి చొరబడ్డారు ఆందోళనకారులు.
హసీనా ఇంట్లో ఉన్న ఫర్నీ చర్ ఇతర వస్తువులను పగలగొట్టి.. కొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారు. మరోవైపు బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంతో భారత్ అలర్ట్ అయింది. బంగ్లాదేశ్ బార్డర్‌లో హై అలర్ట్ ప్రకటించి సరిహద్దు గ్రామాల ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఇప్పటికే బీఎస్‌ఎఫ్ డీజీ కోల్‌కతాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు రెగ్యులర్‌గా నడిచే అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది.
కరోనా తర్వాత బంగ్లా దేశ్ లో పరిస్థితులు దిగజారు తూ వచ్చాయి. యుక్రెయిన్ వివాదంతో బంగ్లాదేశ్ దిగు మతి చేసుకునే ఇంధనం నుంచి నిత్యావసరాల వరకు అన్నీ ధరలు 20శాతం వరకు పెరిగాయి.
యువతకు ఉద్యోగాలు లేవు. కనీసం రోజు గడవ డమే కష్టంగా మారింది. ఇవే విద్యార్థులను విధుల్లోకి వచ్చి ఆందోళన చేయడానికి కారణమయ్యాయి. స్టూడెంట్స్‌లో ఉన్న ఆగ్రహా వేశాలను బంగ్లాదేశ్‌లోని అపోజిషన్ పార్టీ ..బంగ్లా దేశ్ నేషనలిస్ట్ పార్టీ క్యాష్ చేసుకుంది...
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >
ఆగిన బడిబాటకు మళ్లీ ఊపిరి... రామ్ చరణ్‌కు శ్రీమాతా సేవ చారిటబుల్ అండ"
Posted On 2026-06-30 13:21:42
Readmore >
ప్రేమోన్మాది ఘాతుకం : పెళ్లికి నిరాకరించిందని యువతి దారుణ హత్య
Posted On 2026-06-30 08:20:14
Readmore >