| Daily భారత్
Logo




భోజనం తరువాత నడిస్తే ఎన్నో లాభాలు..

News

Posted on 2024-08-05 21:09:39

Share: Share


భోజనం తరువాత నడిస్తే ఎన్నో లాభాలు..

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తిన్న తర్వాత అపానవాయువు, మలబద్ధకం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉంటే భోజనం చేశాక 100 అడుగులు నడవడం అలవాటు చేసుకోండి. భోజనం చేసిన వెంటనే జీర్ణ క్రియ మొదలవుతుంది. ఆ ప్రక్రియకు కావలసిన ఎంజైములు విడుదలవడం మొదలవుతుంది. భోజనం తిన్నాక నడవడం వల్ల పొట్టలో చేరిన గ్యాస్ మొత్తం బయటకు పోయేందుకు వీలు కల్పించినట్టు అవుతుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇలా భోజనం తిన్నాక నడవడం వల్ల సాధారణంగా వచ్చే ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. మెరుగైన నిద్ర.. రాత్రి భోజనం చేసిన తర్వాత 100 అడుగులు వేయడం వల్ల నిద్ర మత్తుగా పట్టే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని నిమిషాలు పాటు ఉత్త పాదాలతో నడవండి. ఇది శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. సుఖంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ అదుపులో.. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు భోజనం చేశాక కచ్చితంగా 100 అడుగులు నడవాలి. ఇది ఆహార పదార్థాల విచ్ఛిన్నం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా అడ్డుకుంటుంది. శారీరకంగా చురుకుగా ఉండేలా చూస్తుంది. రక్తంలో ఉన్న అదనపు గ్లూకోజ్ ను వినియోగిస్తుంది. కాబట్టి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు.. రాత్రి భోజనం చేసిన తర్వాత పావుగంట పాటు నడవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు అత్యంత ప్రభావంతమైన మార్గాలలో భోజనం చేశాక వంద అడుగులు నడవడం అనేది ఒకటి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.ఆయుర్వేదంలో శతపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీ జీవితంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఇచ్చి భోజనం చేసిన వెంటనే 100 అడుగులు నడవడం అలవాటుగా మార్చుకోండి. ఒక నెల రోజుల్లోనే మీకు దీని గొప్పతనం తెలుస్తుంది. మీ ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి.

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >