Posted on 2024-08-05 19:38:34
బాధితురాలని పరామర్శించిన ఎమ్మెల్సీ సురభి వాణీ, మాజీ ఎంపీ మంద జగన్నాథం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు తమ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసులు ఉండరని.. లాఠీ పోలీసులు మాత్రమే ఉంటారని చెప్పారని అది షాద్ నగర్ పోలీస్ నిజం చేశారని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో హరిజన వాడకు చెందిన సునీతను పోలీసులు దొంగతనం కేసులో చిత్రహింసలకు గురి చేశారన్న ఆరోపణలపై ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో స్థానిక ఎమ్మెల్సీ ఎన్. నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ సారధ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీ జగన్నాథం తదితర స్థానిక బీఆర్ఎస్ నాయకుల బృందం బాధితురాలు సునీతను ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరపున తక్షణ సాయం కింద ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి 1 లక్ష రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డ్యూటీ డాక్టర్ తో సునీత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డితో పాటు మరో ఐదు మంది కానిస్టేబుల్స్ ప్రవర్తించిన తీరును బాధితురాలు సునీత వారికి వివరించింది.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >