Posted on 2024-08-04 23:11:44
అన్ని నిర్మాణాలు పూర్తయ్యే వరకు ప్రతి వారం సమీక్ష సమావేశం
అంబేద్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్ల నిర్మాణంలో వేగం పెంచాలి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో ఇప్పటికే స్థలం అందుబాటులోకి వచ్చిన 20 ప్రాంతాల్లో వెంటనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ల నిర్మాణం ప్రారంభించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆయన విద్యాశాఖ, ఆర్ అండ్ బి, ప్రైవేటు నిర్మాణ సంస్థ తదితరులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ల, లేఅవుట్, నిర్మాణ డిజైన్లు, వసతులు, బడ్జెట్ దగ్గర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
మొదటి దశలో ప్రారంభిస్తున్న 20 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి కావాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు .ఈ అంశంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నిర్మాణ సంస్థకు పలు సూచనలు చేశారు. గతంలో చేసిన సూచనలు ఏ మేరకు అమలు చేశారో ఫ్రీ కాస్ట్ నిర్మాణ సంస్థ నిర్వాహకులను విచారించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కోసం ఇప్పటివరకు వచ్చిన స్థలాలకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ అధికారులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 37 ప్రాంతాల్లో 49 పాఠశాలల నిర్మాణానికి సంబంధించిన స్థలాల వివరాలు వచ్చినట్టు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేశం వివరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం లో వేగం పెంచడానికి ప్రతివారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో ఒకటి పూట వెలుతురు, కబడ్డీ వంటి క్రీడలకు అనువైన స్థలం, పార్కులు వంటి వాటి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ లకు త్రిబుల్ బెడ్ రూమ్, ఇతర సిబ్బందికి డబుల్ బెడ్ రూమ్, ఉన్నత విద్యాశాఖ అధికారులు పర్యటనకు వచ్చిన క్రమంలో బస చేసేందుకు సౌకర్యంగా నిర్మాణాలు ఉండాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో వేగం పెంచేందుకు కమిటీలోని సభ్యులకు అని విభజన చేయాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో స్పోర్ట్స్ పీరియడ్ తప్పకుండా నిర్వహించాలని, ఆగస్టు 15, రిపబ్లిక్ డే సందర్భాల్లో విద్యార్థులకు క్రీడా పోటీలు, ఇతర ప్రోత్సాహ కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంబేద్కర్ నాలెడ్జ్ కోచింగ్ సెంటర్స్ నిర్మాణం పనులు త్వరితగతిన ప్రారంభించాలని ఆదేశించారు. ఈ భవనాలకు అవసరమైన స్థలం, నిర్మాణ వ్యయం పైన సమీక్షించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న నాలెడ్జ్ సెంటర్లను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదా పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్మించాలని ఫలితంగా స్థానిక కళాశాల విద్యార్థులు సైతం వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం చేశారు. సమావేశంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి, మహాత్మ జ్యోతిబాపూలే సెక్రెటరీ సైదులు, ఎస్టి, ఎస్సీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సెక్రటరీ సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ
Posted On 2026-06-30 18:00:06
Readmore >
పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-06-30 17:58:38
Readmore >