| Daily భారత్
Logo




రియల్ వెంచర్ల చేతిలో ప్రభుత్వ భూముల కబ్జా : పి.రఘు

News

Posted on 2024-08-04 19:03:37

Share: Share


రియల్ వెంచర్ల చేతిలో ప్రభుత్వ భూముల కబ్జా : పి.రఘు

అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేశారు

షాద్ నగర్ వెంచర్లలో అవినీతి, అక్రమాలు

గత పాలకులు, అధికారుల అక్రమ బుద్ధితోనే యదేచ్చగా సొంత నిబంధనలు

బిల్డింగ్ బ్లాక్స్, సువర్ణకుటీర్, డిఎస్సార్, సిరిసంపదలు, స్పెక్ట్రా తదితర వెంచర్లలో అక్రమాలు

తప్పుడు పద్ధతుల్లో ఇళ్లస్థలాల విక్రయాలు

అక్రమ పద్ధతులపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ఫిర్యాదు చేశాం

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశాం

షాద్ నగర్ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు పి. రఘు, మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ సంచలన ఆరోపణలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్  నియోజకవర్గంలో గత పళ్ల పాటు అధికారంలో ఉండి రియల్ వెంచర్ల నిర్వాహకులతో కుమ్మక్కైన గత పాలకులు, అధికారులు నిబంధనలకు నీళ్లు విడిచి యదేచ్చగా సొంత నిబంధనలు అమలు చేసుకొని పేద ప్రజలకు, ప్రభుత్వానికి నెత్తిన శఠగోపం  పెట్టారని, చివరకు గుళ్ళు గోపురాలు సైతం నేలమట్టం చేశారని ఈ పాపం ఊరికే పోదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదివాసి కాంగ్రెస్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ పీ. రఘు, పిసిసి సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, డిసిసి ఉపాధ్యక్షులు ఎమ్మె సత్తయ్య, టీ. శంకర్  సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. గత పదేళ్లలో పాలకులు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒకటి నిబంధనలకు పాతర వేశారని, ఎక్కడ ప్రభుత్వ నిబంధనలు అమలు చేయలేదని ఆరోపించారు. యధా రాజా తథా ప్రజా అన్నట్టు పాలకులు తమ అవసరాలకు అనుగుణంగా ఆర్థిక స్వార్థాలతో ఆలోచించి ప్రభుత్వానికి వాటి ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల రియల్ వెంచర్లు చేసిన బిల్డింగ్ బ్లాక్స్ యజమానులు, అదేవిధంగా సువర్ణ కుటీర్, డిఎస్ఆర్, సిరిసంపదలు, స్పెక్ట్రా, స్వర్గసీమ లాంటి అనేక వెంచర్లు నిబంధనకు నీళ్లు వదిలారని ప్రభుత్వ భూములను కూడా తమ ఆధీనంలో పెట్టుకొని దర్జాగా వెంచర్లు చేస్తున్నారని ఆరోపించారు. గత పాలకులు చేసిన పాపం ఇప్పుడు పండబోతుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంకకు తమ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ద్వారా అనేక ఫిర్యాదులు వెళ్లాయని మీడియాకు స్పష్టం చేశారు. దీనికి సంబంధం ఉన్న ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని గత పాలనలో ప్రజాప్రతినిధులు ఏది చెబితే అది అడ్డగోలుగా చేసిన అధికారులను కూడా వదిలిపెట్టబోమని వారు హెచ్చరించారు. వేలాది వెంచర్లు ఏర్పాటు చేసినప్పటికీ 10 శాతం ప్రభుత్వ భూములు అటు గ్రామపంచాయతీకి గాని ఇటు మున్సిపాలిటీకి గాని సరైన స్థితిలో లేకపోవడం విచారకరమని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే ప్రభుత్వ 10% భూములను కొన్ని వెంచర్ల నిర్వాహకులు కైంకర్యం చేశారని ఇది చాలా బాధాకరమని ఈ సందర్భంగా చెప్పారు. వెంచర్లు చేసేందుకు అణువుగా లేకపోయినా భూములను సైతం వెంచర్లుగా చేశారని అదేవిధంగా వ్యవసాయానికి పనికి వచ్చే భూములను కూడా నాలా కింద కన్వర్షన్ చేయడం మహా పాపమని అన్నారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే భూములకు నాలా కన్వర్షన్ సర్టిఫికెట్లు ఎలా జారీ అయ్యాయో అధికారుల సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. 

ప్రతి ఎకరాకు కమిషన్లు..

గత ప్రభుత్వ పాలనలో కొంతమంది ప్రజాప్రతినిధులు వారి బంధువులు రియల్ వెంచర్ల వ్యవహారంలో అధికారులను తమ స్టాంపుల్లాగా వాడుకున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఎకరాకు ఇంత కమిషన్ మాట్లాడుకుని వాళ్ళు చెప్పిందే వేదంగా భావించి అధికారులు వెంచర్లకు తొత్తుల్లా పనిచేసిన దాఖలాలు లేకపోలేదని అన్నారు. రియల్ నిర్వాహకులు తమకు ఇష్టం వచ్చినట్టు అక్రమ నిబంధనలతో పనులు చేసుకుంటే వాటికి గ్రీన్ సిగ్నల్ మాత్రం పాలకులు ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరి కనుసన్నలలో ఇలాంటి అరాచకం జరిగాయని ఆర్థిక లావాదేవీలు ప్రభుత్వ లావాదేవీలు ముడిపడి జరగడం బాధాకరమని విమర్శించారు. నియోజకవర్గంలో జరిగిన వెంచర్ అక్రమాలపై శాసనసభలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఫిర్యాదు చేశారని ఈ అంశాలపై సభలో మాట్లాడాలని వారు గుర్తు చేశారు. గత ప్రభుత్వ పెద్దలు చెబితేనే భూముల లావాదేవీలు జరిగేవని కొన్ని ప్రాంతాలలో వారికి తెలియకుండా ఎకరం జాగా కూడా ఎవరు ఖరీదు చేయలేని పరిస్థితి నెలకొల్పారని అన్నారు. 

పురాతన దేవాలయాన్ని ధ్వంసం చేశారు..

పట్టణ శివారులో ఉన్న వెంచర్లో పాలకుల అండతో వారి ఆదేశాలతోనే పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నేలమట్టం చేశారని ఈ పాపం ఊరికే పోదని రఘు, బాబర్ ఖాన్ ఎమ్మే సత్తయ్య హెచ్చరించారు. అనాదిగా వస్తున్న పూర్వ చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నేలమట్టంపై ఇప్పటికే ఈ ప్రాంతానికి చెందిన పెద్దమనుషులు ఆనాటి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని ఆర్డీవోకు ఇతర అధికారులకు పోలీసులకు కూడా లిఖితపూర్వక ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపైన కూడా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎక్కడ చూసినా గత పది ఏళ్లలో నిబంధనలకు పాతర వేసి తమ ఇష్టారాజ్యంగా సొంత చట్టంగా భావించి విధ్వంసం సృష్టించారని పేర్కొన్నారు. రియల్ వెంచర్ల వద్ద చేతికి అందినంత దండుకున్నారని ఆరోపించారు. 

అధికార యంత్రాంగం కదలాలి

షాద్ నగర్ ప్రాంతంలో అక్రమ రియల్ వెంచర్లు, ప్రభుత్వ భూముల కబ్జా, అక్రమ నాలా సర్టిఫికెట్లు, లేఅవుట్ పర్మిషన్లు, 10% భూములు ఇలా పలు అంశాల్లో అక్రమ వెంచర్ల వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్డీవో స్థాయిలో అధికార సిబ్బందితో ఓ బృందం విచారణ జరపాలని ఇందులో ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు ఎవరు అక్రమాలకు పాల్పడినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రఘు, బాబర్ డివైడ్ చేశారు..

Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >
Image 1

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయం కల్కి ఆలయంలో అన్న ప్రసాద వితరణ

Posted On 2026-06-30 18:00:06

Readmore >
Image 1

పదవీ విరమణ పొందిన ఉషయ్యకు ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-30 17:58:38

Readmore >